తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు

జయలలిత మరణంపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. హల్వా ఇచ్చి జయలలితను చంపేశారని ఆయన ఆరోపించారు. విళుపురం జిల్లా కళ్లకురిచ్చి యూనియన్ అన్నాడీఎంకే తరపున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న జయ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్
జయలలితకు డయాబెటిస్ ఉందని తెలిసి కూడా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమెకు హల్వా ఇచ్చారని తెలిపారు. వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే.. ఆమెకు హల్వా ఇచ్చారని తెలిపారు. హాస్పిటల్ లో ఉన్న సమయంలో జయలలితను కలిసేందుకు తాను చాలా ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. కానీ కుదరలేదని వివరించారు. శశికళ తనను అనుమతించలేదని ఆరోపించారు. ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న ఆమెకు గుండెపోటు ఎలా వస్తుందని.. అది సాధ్యం కాదని వెల్లడించారు.
గుండెపోటు వస్తే హాస్పిటల్ వరండాలో రక్తం ఎలా చిందిందని ప్రశ్నించారు. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. విచారించాల్సిన విధంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు తమిళరాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి