Viral Video: విద్యార్థితో కలిసి టీచర్ డ్యాన్స్.. అదుర్స్ కదూ

ఈ వీడియో ఇప్పటికే ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

Viral Video: విద్యార్థితో కలిసి టీచర్ డ్యాన్స్.. అదుర్స్ కదూ

Updated On : September 15, 2024 / 2:33 PM IST

విద్యార్థితో కలిసి ఓ టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో వారు వేసిన ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలను ఆదర్శ్ ఆగ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ఈ వీడియో ఇప్పటికే ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఓ విద్యార్థి వేదికపై డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో ఓ టీచర్ వచ్చి డ్యాన్స్ చేశాడు. వారిద్దరు నల్లటి రంగు దుస్తులు వేసుకున్నారు. వారు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన తీరు ప్రేక్షకులను అలరించింది.

‘హీరో నెం. 1’ సినిమా కోసం ఆనంద్ మిలింద్ సంగీతం సమకూర్చగా సోనూ నిగమ్ పాడిన యూపీ వాలా థంకా పాటకు ఈ స్టూడెంట్, టీచర్ డ్యాన్స్ చేశారు. ఆ సినిమాలో ఈ పాటకు గోవింద, కరిష్మా కపూర్‌లను డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థితో టీచర్ డ్యాన్స్ చేసిన తీరు అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Adarsh Ag. (@iamadarshag)

గణేశ్ నిమజ్జనం వేళ హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. బారికేడ్లు, ప్లెక్సీలను తొలగింపు