Gwalior: హోం వర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి.. కాళ్లు, చేతులు పట్టుకుని, పైపుతో కొట్టిన టీచర్లు

ఆ విద్యార్థి చదువుతున్న క్లాసు 8వ తరగతే. అతడిని టేబుల్‌పై పడుకోబెట్టి మరీ కొట్టారు.

Gwalior: హోం వర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి.. కాళ్లు, చేతులు పట్టుకుని, పైపుతో కొట్టిన టీచర్లు

Gwalior

Updated On : September 4, 2023 / 2:19 PM IST

Gwalior – Madhya Pradesh: కోచింగ్ సెంటర్లలో చదువుతోన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ వాటి నిర్వాహకులు తీరు మార్చుకోవడం లేదు. విద్యార్థులను మార్కులు, ర్యాంకులు రాబట్టే యంత్రాలుగా, తమకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చే వస్తువుగా వాడుకుంటున్నారు.

కోచింగ్ సెంటర్లను వ్యాపార కేంద్రాలుగా తయారు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాజస్థాన్‌లోని కోటా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతగా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఓ కోచింగ్ కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

గణిత హోంవర్క్ చేయలేదని 13 ఏళ్ల విద్యార్థిని టీచర్లు ప్లాస్టిక్ పైపుతో కొట్టారు. ఆ విద్యార్థి చదువుతున్న క్లాసు 8వ తరగతే. అతడిని టేబుల్‌పై పడుకోబెట్టి మరీ కొట్టారు. అభిషేక్ అనే టీచర్ ఆ విద్యార్థి కాళ్లను పట్టుకున్నాడు. సంకేత్ అనే టీచర్ ఆ బాలుడి చేతులు పట్టుకుని అతడిని కదలకుండా చేశాడు.

రాహుల్ అనే మరో టీచర్ ప్లాస్టిక్ పైపుతో ఆ బాలుడిని కొట్టాడు. చివరికి ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని, చంపేస్తామని టీచర్లు హెచ్చరించారని ఆ బాలుడు తెలిపాడు. ఆ కోచింగ్‌ కేంద్ర డైరెక్టర్‌ చంద్రకాంత్ మిశ్రాతో పాటు మరో నలుగురు టీచర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Iran Coal Mine Explosion : ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు…ఆరుగురి మృతి