Bihar : ఇంటినే కోవిడ్ సెంటర్ గా మార్చేసిన తేజస్వీ యాదవ్

బీహార్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వీ యాద‌వ్ త‌న అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చేశారు.

Bihar : ఇంటినే కోవిడ్ సెంటర్ గా మార్చేసిన తేజస్వీ యాదవ్

Covid Center

Updated On : May 20, 2021 / 11:31 AM IST

Tejashwi Yadav : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఏంతో మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. బెడ్స్ లేక, ఆక్సిజన్ దొరక్క ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. బీహార్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వీ యాద‌వ్ త‌న అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చేశారు.

ఈ సెంటర్ లో రోగులకు చికిత్సకు అవసరమైన సౌకర్యలను కల్పించారు. అవ‌స‌ర‌మైన వైద్య సిబ్బందిని నియమించాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఆరోగ్య‌శాఖ మంత్రుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా లేఖ రాశారు. ఈ లేఖ‌ను రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మంగ‌ళ్ పాండే, సీఎం నితీశ్ కుమార్‌కు ట్విట్ట‌ర్‌లో ట్యాగ్ చేశారు. అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చేసినట్లు, ఇందులో మంచాలు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, స్టాండ‌ర్డ్ మెడిసిన్స్‌, రోగులు, వారి స‌హాయ‌కుల‌కు అవ‌స‌ర‌మైన ఆహార వ‌స‌తులు క‌ల్పించినట్లు తేజస్వీ యాదవ్ వెల్లడించారు.బీహార్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వీ యాద‌వ్ త‌న అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చేశారు.

Read More : What’s this doctor? : మాస్కు పెట్టుకోను ఏం చేస్తారు? అంటూ డాక్టర్ రచ్చ..