ప్రైవేట్ జెట్ లో తేజస్వీ బర్త్ డే…నెటిజన్లు ఫైర్

బీహార్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ శనివారం తన 30వ పుట్టినరోజు వేడుకలను ఒక ప్రైవేటు విమానంలో జరుపుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తేజస్వి యాదవ్…శనివారం తన తండ్రిని రాంచి జైలులో కలిసి తిరిగి పాట్నాకు వెళ్లేందుకు ఒక ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకుని అందులో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అంతేకాదు విమానంలో తేజస్వి కేక్ కట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొత్త బట్టలు ధరించిన తేజస్వి తన స్నేహితులతో కలసి విమానంలో పార్టీ చేసుకున్నారు. ఆర్జేడీ రాష్ట్ర ప్రెసిడెంట్ రామచంద్ర పుర్బే,అబ్దుల్ బారీ సిద్దిఖీ,శివ్ చంద్ర రామ్,కంతీ దేవీ,తన్వీర్ హాసన్ లు తేజస్వీతో పాటు విమానంలో ఉన్నారు. అయితే ప్రేవేటు విమానంలో బర్త్ డే పార్టీ చేసుకున్న తేజస్విపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బీహార్‌కు చెందిన పేద ప్రజలకు ఇతను నాయకుడా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరో నెటిజన్ అయితే ఒక అడుగు ముందుకేసి మీ నాన్న జైలులో ఉంటే నువ్వు ప్రైవేట్ విమానంలో నీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నావా అంటూ చురకలు అంటించాడు.
కనీసం ఇన్నాళ్లకు మళ్లీ జనాలకు కన్పించారు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అటు బీజేపీ కూడా తేజస్వీ ప్రేవేట్ జెట్ బర్త్ డే పార్టీపై స్పందించింది. తేజస్వీ పుట్టడంతోనే బంగారు స్పూన్ తో పుట్టాడని,అలాంటి వాళ్లకు పేద ప్రజలు అంటే చులకనని,అంతేకాకుండా తేజస్వీ లాంటి వ్యక్తలు పోలిటికల్ పార్టీ పేరుతో ఉన్న నల్లమచ్చలు అని బీహార్ బీజేపీ అధికారిక ప్రతినిధి నికిల్ ఆనంద్ తెలిపారు. అయితే బీజేపీ తేజస్వీ ఫోబియా పట్టుకుందని ఆర్జేడీ కౌంటర్ ఇచ్చింది.
गरीब-गुरबा के नेता और लालू यादव के पुत्र तेजस्वी यादव के जन्मदिन का जश्न, चार्टर प्लेन में मनाया जा रहा है, जमीन से 30000 फीट की ऊंचाई पर हवाई जहाज में दावत उड़ाई जा रही है। वाह रे गरीबी, वह रे फ़क़ीरी।
वाया @kumarprakash4u pic.twitter.com/Q1sGVOCZPG— Vikas Bhadauria (ABP News) (@vikasbha) 11 November 2019