ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 01:03 AM IST
ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు

Updated On : March 24, 2019 / 1:03 AM IST

పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా ఏ ప్రభుత్వం  వస్తుందనే అంచనాను ఈ ఎగ్జిట్ పోల్స్ ఇస్తుంటాయి.

అయితే ఈసారి అటువంటి ప్రసారాలు అన్నీ దశల ఎన్నికలు అయిపోయేవరకు చేయకూడదంటూ తెచ్చిన నిబంధన అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తించనుంది. సాధారణ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 11న మొదలై మే 17న ముగియనున్నాయి. అంటే మే 17వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయకూడదు. 

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ నియమం వర్తించనుంది. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా.. వాటి ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. అంటే దాదాపు నెల 12రోజులు గ్యాప్ రానుంది.

ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌తో ముందే ఏ పార్టీ వస్తుంది అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనుకున్న రాజకీయ నాయకులకు నిరాశే ఎదురైంది. అలాగే ప్రతీ దశ ఎన్నికలకు 48 గంటల ముందు టీవీ, రేడియో చానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా వేదికల్లో అభ్యర్థుల గురించి ప్రసారాలు చేయకూడదని స్పష్టం చేసింది.