‘ఉగ్రవాది గో బ్యాక్ ’అంటూ బీజేపీ ప్రఙ్ఞా సింగ్‌ను అడ్డుకున్న విద్యార్ధులు

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 06:56 AM IST
‘ఉగ్రవాది గో బ్యాక్ ’అంటూ బీజేపీ ప్రఙ్ఞా సింగ్‌ను అడ్డుకున్న విద్యార్ధులు

Updated On : December 26, 2019 / 6:56 AM IST

బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు విద్యార్దులతో చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్‌ చతుర్వేది నేషనల్‌ యూనివర్సిటీలో విద్యార్దులు తమకు అటెండన్స్‌ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రఙ్ఞా సింగ్‌ వెళ్లారు. దీంతో విద్యార్ధులు మరింతగా రెచ్చిపోయారు. ప్రఙ్ఞా సింగ్‌ ను ఉగ్రవాదితో పోలుస్తూ..‘ఉగ్రవాది గో బ్యాక్ ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బీజేపీ మద్దతుదారులు సదరు విద్యార్ధులకు దీటుగా నినాదాలు చేయటంతో వర్శిటీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. 

తమకు అటెండన్స్‌ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా శ్రేయా పాండే, మను శర్మ అనే విద్యార్థుల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. దీంతో విద్యార్దులకు నచ్చ చెప్పేందుకు..సమన్వయం చేసేందుకు ప్రఙ్ఞా సింగ్‌ వెళ్లారు. ఇంతలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అక్కడికి వచ్చి..‘ఉగ్రవాది గో బ్యాక్ ’ అంటూ ప్రఙ్ఞాను ఉద్దేశించి నినాదాలు చేశారు. 

ఈ క్రమంలో వర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులందరినీ చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. ఎట్టకేలకు కొన్ని గంటల తరువాత పరిస్థితి చక్కబడింది. దీనిపై ఎంపీ ప్రఙ్ఞా మాట్లాడుతూ.. ఉగ్రవాది అని నినాదాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తు తెలిపారు.  ఒక ఎంపీని పట్టుకుని ఉగ్రవాది అనటంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కాగా..2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా  ప్రఙ్ఞా సింగ్‌ ఉన్నారు. బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగి భోపాల్‌ ఎంపీగా  ప్రఙ్ఞా సింగ్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రఙ్ఞా సింగ్‌ పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ఆమె ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడు అంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్నారు.

దీంతో బీజేపీ అధిష్టానం కూడా  ప్రఙ్ఞా సింగ్‌ పై మండి పడింది. చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఆమె ఎట్టకేలకు పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలాగే తాజాగా తానుబుక్ చేసుకున్న సీట్ ను తనకు కేటాయించలేందూ  స్పైస్‌జెట్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించటం..స్పైస్ జెట్ సిబ్బందిపై ప్రగ్యా ఫిర్యాదు చేయటం..దీంతో విమానం ఆలస్యం కావటంతో తోటి ప్రయాణీకులు కూడా ఆమెను విమర్శించటం వంటివి జరిగాయి. ఇలా  ప్రఙ్ఞా సింగ్‌ అంటే వివాదాలకు కేంద్రంగా నిలుస్తుంటారు.