India Covid Surge : విజృంభిస్తోన్న కరోనా..రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

 కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్​ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం

India Covid Surge : విజృంభిస్తోన్న కరోనా..రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Covid Test

Updated On : December 31, 2021 / 10:30 PM IST

India Covid Surge : కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్​ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. శ్వాసలో ఇబ్బంది,రుచి, వాసన కోల్పోవడం,జ్వరం, తల నొప్పి, ఒంటి నొప్పులు,విరోచనాలు, నీరసం,గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే కోవిడ్ గా అనుమానించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కరోనా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నందున ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రజలు స్వయంగా కరోనా టెస్టులు చేసుకునేలా సెల్ఫ్ టెస్ట్ లపై అవగాహన కల్పించాలని చెప్పింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ర్యాపిడ్ టెస్ట్ బూత్ లు ఏర్పాటు చేయాలని సూచించింది.

మరోవైపు, దేశంలో ఇన్నాళ్లు ప్రబలంగా ఉన్న కరోనా డెల్టా వేరియంట్ స్థానాన్ని ‘ఒమిక్రాన్’ భర్తీ చేయడం ప్రారంభమైందని అధికార వర్గాలు శుక్రవారం హెచ్చరించాయి. కరోనా సోకిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 80శాతం మంది ‘ఒమిక్రాన్’ బాధితులేనని తెలిపాయి.

కాగా,దేశంలో డిసెంబరు 2న ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ ఒమిక్రాన్ కట్టడి కోసం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేస్తూ వస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1200కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా,ఇందులో సగానికి పైగా కేసులు మహారాష్ట్ర,ఢిల్లీలోనే నమోదయ్యాయి.

ALSO READ KL Rahul : భారత జట్టుకి కొత్త కెప్టెన్.. 18మందితో కూడిన టీమ్ ప్రకటించిన సెలక్టర్లు