Textiles: టెక్స్ టైల్స్‌‌పై జీఎస్టీ పెంపు వాయిదా

ముందుగా 5శాతం నుంచి 12శాతానికి పెంచాలని కేంద్రం భావించగా... తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మండలి నిర్ణయంతో...

Textiles: టెక్స్ టైల్స్‌‌పై జీఎస్టీ పెంపు వాయిదా

Gst

Updated On : December 31, 2021 / 1:50 PM IST

Textiles GST : చేనేతపై జీఎస్టీని 12 శాతానికి పెంచుతారా.. ఇప్పుడున్నట్లు 5 శాతానికే పరిమితం చేస్తారా అన్నది తేలిపోయింది. 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్స్‌ రంగంపై జీఎస్టీ శాతం పెంపు వాయిదా వేసింది మండలి. ముందుగా 5శాతం నుంచి 12శాతానికి పెంచాలని కేంద్రం భావించగా… తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మండలి నిర్ణయంతో 2022, జనవరి 01వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన పెంపు వాయిదా పడింది.

Read More : Uttar Pradesh Politics : పేర్లు గందరగోళం…మరో పెర్‌ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు

చేతి వృత్తుల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచి కేంద్రం ఉపాధి లేకుండా చేస్తోందని విపక్షాలు విమర్శించాయి. వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు కూడా. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. జీఎస్టీ పెంపుతో వస్త్రపరిశ్రమ కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More : Indian Army : ఈ ఏడాది 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

జీఎస్టీ విధించడం వల్ల నేతన్నల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయని కేంద్రానికి తెలిపారు కేటీఆర్‌. జీఎస్టీ పన్ను పెంపు విషయంలో.. వస్త్ర పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను, జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. లేకుంటే.. టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదముందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరే దేశంలోని నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు మంత్రి కేటీఆర్‌. మొత్తానికి కేంద్రం జీఎస్టీపై తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.