గుడ్ బై విక్రమ్.. ఇస్రో బావోద్వేగ ట్విట్

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 06:41 AM IST
గుడ్ బై విక్రమ్.. ఇస్రో బావోద్వేగ ట్విట్

Updated On : September 18, 2019 / 6:41 AM IST

చంద్రయాన్ 2.. అడుగు దూరం అద్భుతం అయ్యింది. 95 శాతం సక్సెస్ తో ముగిసింది. 100శాతం విజయం కాకపోవటంపై శాస్త్రవేత్తలు మనోదనకు.. దేశం మొత్తం మద్దతుగా నిలిచి హ్యాట్సాప్ చెప్పింది. ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణం వైపు వెళ్లిన చంద్రయాన్ 2 కాలు పెట్టింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ణలు విజయవంతంగానే దిగాయి. అయితే సిగ్నల్స్ వ్యవస్థ దెబ్బతిన్నది.

ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ అయ్యింది. దీంతో ల్యాండర్ నుంచి రోవర్ బయటకు రాలేకపోయింది. ఈ రెండింటి కాల పరిమితి 14 రోజులు. ఈ రెండు వారాలు సిగ్నల్స్ కోసం శతవిధాలా ప్రయత్నించింది ఇస్రో. నాసా సాయం కూడా తీసుకుంది. అయినా ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించలేకపోయారు. ఈలోపు గడువు కూడా ముగిసింది. దీంతో ల్యాండర్ కు దాదాపు గుడ్ బై చెప్పినట్లుగా ట్విట్ చేసింది ఇస్రో.
Read More : బర్త్‌డే వేడుకల్లో ఎంపీ అత్యుత్సాహం: మోడీ ఫోటోకి పూలదండ
మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళుతూనే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జర్నీ సాగుతుంది అంటూ ట్విట్ చేసింది ఇస్రో. ఇస్రో ప్రకటనతో చంద్రయాన్ 2 అనేది ఇక సైలెంట్ అయిపోయినట్లే అంటున్నారు. ల్యాండర్ పూర్తిగా మూగబోయిందని.. చంద్రుడి దక్షిణ ధృవంలో భారతదేశ జ్ణాపకంగా మిగిలిపోనుంది.

ఈ ప్రయోగం చేపట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. తర్వాత ఎవరు వెళ్లినా.. ఏ ప్రయోగం చేపట్టినా మొదటగా భారత్ ల్యాండర్ విక్రమ్ ను గుర్తు చేసుకోవాల్సిందే.. గుర్తుంచుకోవాల్సిందే. దట్స్ ఇస్రో.