Mulayam Singh Yadav Death: ఆ ఒక్క రెజ్లింగ్ మ్యాచ్.. ములాయం జీవితాన్ని మలుపు తిప్పింది.. యూపీకి మూడు దఫాలు సీఎం అయ్యేలా చేసింది..
ములాయం స్వతహాగా రెజ్లర్. ఆ ఆటలో ప్రత్యర్థులను మట్టికరిపించేవాడు. 1960 దశకంలో మెయిన్‌పురి జిల్లాలో ఓ రెజ్లింగ్ టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నీని వీక్షించేందుకు సోషలిస్టు పార్టీ ఎమ్మెల్యే నాథూ సింగ్ అక్కడకు వెళ్లారు. అక్కడి నుంచి ములాయం జీవితం పూర్తిగా మారిపోయింది. రెజ్లర్ నుంచి రాజకీయ నేతగా ఆయన ప్రస్థానం మొదలైంది.

mulayam
Mulayam Singh Yadav Death: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. ములాయం సింగ్ నవంబర్ 1939న ఇటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించారు. ఆగ్రా యూనివర్సిటీలో పాలిటిక్స్‌లో ఏంఏ చేశారు.
ములాయం స్వతహాగా రెజ్లర్. ఆ ఆటలో ప్రత్యర్థులను మట్టికరిపించేవాడు. 1960 దశకంలో మెయిన్‌పురి జిల్లాలో ఓ రెజ్లింగ్ టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నీని వీక్షించేందుకు సోషలిస్టు పార్టీ ఎమ్మెల్యే నాథూ సింగ్ అక్కడకు వెళ్లారు. పొట్టిగా, గట్టిగా ఉన్న ములాయం రెజ్లింగ్ స్కిల్స్‌ను చూసిన నాథూ సింగ్ ఇంప్రెస్ అయ్యారు. బలమైన ప్రత్యర్థులను ఈజీగా పడేస్తున్న ములాయం టెక్నిక్స్ నాథూను అట్రాక్ట్ చేశాయి. దీంతో ఆ యువ రెజ్లర్ తనను కలవాలంటూ ఎమ్మెల్యే నాథూ కోరారు.
Mulayam Singh Yadav Death: ములాయం సింగ్ యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. ఎవరేమన్నారంటే..?
ఆ ఒక్క మ్యాచ్ తో ములాయం జీవితం పూర్తిగా మారిపోయింది. రెజ్లర్ నుంచి రాజకీయ నేతగా ఆయన ప్రస్థానం మొదలైంది. ములాయంను పిలుపించుకున్న ఎమ్మెల్యే నాథూ రాజకీయాలపై ఏమైనా ఆసక్తి ఉందా అని ప్రశ్నించారట. అయితే, తొలుత ములాయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ములాయం చదువుకున్నాడని, స్థానిక జెయిన్ కాలేజీలో టీచింగ్ కూడా చేస్తున్నట్లు తెలుసుకున్న యునైటెడ్ సోషలిస్టు ఎమ్మెల్యే నాథూ సింగ్ మరింత స్టన్ అయ్యారట. నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని ములాయంను రాజకీయాల్లోకి నాథూ సింగ్ ఆహ్వానించారు. ఇక అప్పుడే ములాయం రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాథూనే ములాయంకు పొలిటికల్ గురువుగా మారారు.
Actor Kasthuri Shankar: నయన్ దంపతులు చేసిన పని చట్టరీత్యా నేరం.. నటి కస్తూరి!
నాథూ సింగ్ సహకారంతో 1967 లో యూపీలోని జశ్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి ములాయం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు. అప్పటి నుంచి ములాయంకు రాజకీయంగా ఎదురులేకుండా పోయింది. యూపీలోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ములాయం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.