Mulayam Singh Yadav Death: మూడు సార్లు ఉత్తర‌ప్రదేశ్ సీఎంగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్.. రాజకీయ ప్రస్థానం ఇలా..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1967లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ములాయం.. మూడు సార్లు యూపీ సీఎంగా పనిచేశారు. 10సార్లు ఎమ్మెల్యేగా, ఏడు సార్లు ఎంపీ గా ములాయం విజయం సాధించాడు.

Mulayam Singh Yadav Death: మూడు సార్లు ఉత్తర‌ప్రదేశ్ సీఎంగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్.. రాజకీయ ప్రస్థానం ఇలా..

Mulayam singh yadav

Mulayam Singh Yadav Death: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, దేశ రక్షణ మంత్రిగానూ పనిచేశారు. యూపీ రాజకీయాల్లోనేకాక దేశ రాజకీయాల్లోనూ ములాయం తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.

ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఇలా..

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు యూపీ సీఎంగా పనిచేశారు. 10సార్లు ఎమ్మెల్యేగా విజయంసాధించిన ములాయం, ఏడు సార్లు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించాడు.

1967లో ములాయం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

అదే సంవత్సరం ఎస్ఎస్‌పీ నుంచి జశ్వంత్‌నగర్ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1974 సంవత్సరంలో రెండవ సారి బీకేడీ (భారతీయ క్రాంతిదళ్ పార్టీ) పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1975లో అరెస్టయిన ప్రతిపక్ష రాజకీయ నాయకులలో ములాయం ఒకరు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన జాతీయ అత్యవసర పరిస్థితిలో 19నెలలపాటు అతని పదవీకాలం అంతరాయం కలిగింది.

1977లో విడుదలయిన ములాయం.. మూడవ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు.

అదే సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌లో లోక్ దళ్ (పీపుల్స్ పార్టీ) అధ్యక్షుడయ్యాడు.

1980 సంవత్సరంలో జనతాదళ్ (జేడీ) అధ్యక్షుడిగా ములాయం ఎన్నికయ్యాడు.

1989 లో జేడీ, బీజేపీ మద్దతుతో యూపీ సీఎంగా ములాయం బాధ్యతలు చేపట్టారు. అయితే 1991లో ములాయం ప్రభుత్వం పడిపోయింది.

1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు ధ్వంసం, అల్లర్లు జరిగిన తరువాత ములాయం సింగ్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.

కొత్త పార్టీకి సమాజ్ వాదీ (సోషలిస్ట్) పార్టీగా నామకరణం చేశారు.

నవంబర్ 1993లో సమాజ్ వాదీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాతి నెలలో ములాయం యాదవ్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు.

1995లో ములాయం ప్రభుత్వం పడిపోయింది.

1996లో ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి. ప్రధాన మంత్రి పదవికి చేరువయ్యారు.

యునైటెడ్ ఫ్రంట్ (యూఎఫ్) సంకీర్ణ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా ములాయం పనిచేశారు.

యూఎఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో హెచ్.‌డీ దేవెగౌడ, ఐ.కే గుజ్రాల్ ప్రధానిగా ఉన్న సమయంలో 1 జూన్ 1996 నుంచి 19 మార్చి 1998 వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి గా ములాయం పనిచేశారు.

2002 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ పునరాగమనం చేసింది. అనేక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. మెజార్టీ ఆశించిన స్థాయిలో రాలేదు.

అయితే, 2023లో స్వల్ప కాలిక బీఎస్పీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఎస్పీ దాని సొంత పాలక సంకీర్ణాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ములాయ్ సింగ్ యాదవ్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2007 మే వరకు సీఎంగా ములాయం కొనసాగారు.

2012 ప్రారంభంలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పూర్తి మెజార్టీని సాధించింది. అయితే, ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్‌ను రాష్ట్ర మంత్రిగా చేసేందుకు తాను పక్కకు తప్పుకున్నాడు.