Bengaluru : బెంగళూరు కోచింగ్ సెంటర్లో మిస్ అయిన బాలుడు.. హైదరాబాద్‌లో ప్రత్యక్షం..అసలేం జరిగింది?
12 సంవత్సరాల బాలుడు.. 21వ తేదీ ఆదివారం బెంగళూరులో మిస్ అయ్యాడు. పోలీసులు వెతుకులాట.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం మధ్య ఆ బాలుడుని హైదరాబాద్‌లో కనుగొన్నారు. అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు?

Bengaluru
Bengaluru : జనవరి 21వ తేదీన బెంగళూరులో మిస్ అయిన పరిణవ్ అనే 12 ఏళ్ల బాలుడు అనూహ్యంగా హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలో చివరిసారిగా బస్సు దిగుతూ కనిపించిన పరిణవ్ హైదరాబాద్‌కి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు?
21వ తేదీ ఆదివారం నాడు బెంగళూరులో తప్పిపోయిన 12 సంవత్సరాల బాలుడు పరిణవ్ హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో కనిపించడంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 3 రోజులుగా అతని కోసం అటు పోలీసుల వెతుకులాటతో పాటు సోషల్ మీడియా కదిలివచ్చింది. ఈ రెండు మెట్రో నగరాల మధ్య దూరం 570 కిలోమీటర్లు. అసలు ఇంతదూరం పరిణవ్ ఎందుకు వచ్చినట్లు?
PM Modi : కుష్బూ అత్త గారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న ప్రధాని మోదీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..
డీన్స్ అకాడమీకి చెందిన పరిణవ్ 6వ తరగతి చదువుతున్నాడు. మొదటగా వైట్ ఫీల్డ్‌లోని కోచింగ్ సెంటర్ నుండి బయలుదేరిన పరిణవ్ బెంగళూరులోని మెజిస్టిక్ బస్ టెర్మినస్‌లో బస్సు దిగుతూ చివరి సారి కనిపించాడు. తమ బిడ్డ కనిపించకుండా పోవడంతో పరిణవ్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆచూకీ కోసం పోలీసులతో పాటు సోషల్ మీడియాను కూడా ఆశ్రయించారు. తమ బిడ్డ రోడ్డు మీదుగా నడుస్తున్నట్లు చూపించే CCTV ఫుటేజ్‌ని పోస్ట్ చేసి పరిణవ్‌ను కనుగొనమంటూ అభ్యర్ధించారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై వెంటనే స్పందించారు. మరోవైపు పరిణవ్ తల్లి తన బిడ్డను ఇంటికి రమ్మంటూ వీడియోను పోస్ట్ చేసారు. పరిణవ్ పోస్టర్లు ఆన్ లైన్‌లో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న బెంగళూరు నివాసి మెట్రోలో ఉన్న పరిణవ్‌ను గుర్తించారు. బాలుడు తన వివరాలు ధృవీకరించడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అసలు పరిణవ్ హైదరాబాద్
FOUND!
Parinav is not lost anymore. His family is on route to Hyderabd to find him.
Message from his mother below. https://t.co/UeXGibdIi3 pic.twitter.com/zNQeTRPxkw
— Whitefield Rising (@WFRising) January 24, 2024
కు ఎందుకు వెళ్లాడో తెలియదంటున్నారు అతని తండ్రి. పరిణవ్‌ను తీసుకురావడానికి హైదరాబాద్‌కు బయలుదేరారు.
Gold Rate Today : మూడు రోజులుగా అవే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
పరిణవ్ హైదరాబాద్ ఎందుకు వెళ్లాడో ఖచ్చితమైన వివరాలు తమకు తెలియదని.. అతనిని తీసుకురావడానికి వెళ్తున్నామని అన్ని వివరాలు తెలిసిన తర్వాత అప్ డేట్ చేస్తామని పరిణవ్ తండ్రి చెప్పారు. తన బిడ్డను కనుగొనడంలో తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. పరిణవ్ తల్లి సైతం తమ బిడ్డను కనుగొన్న వారికి ముఖ్యంగా నాంపల్లి రైల్వే అధికారులుకు ధన్యవాదాలు అంటూ మరో వీడియోను పోస్టు చేసారు. కాగా అసలు పరిణవ్ హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది.
BREAKING: Great news! Parinav has been found safe. He was spotted at the Nampally metro station in Hyderabad. His parents are on their way to get him. Wishing the family better times ?? https://t.co/Aok1cJK4gy pic.twitter.com/WnjMpP75ys
— Shiv Aroor (@ShivAroor) January 24, 2024