Elephant Says Thank: వావ్..! తనను కాపాడిన జేసీబీకి కృతజ్ఞతలు తెలిపిన ఏనుగు.. వీడియో చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..
మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయ పడితే వారికి కృతజ్ఞత తెలుపుతాం. అది మానవుని లక్షణం. అయితే జంతువులు కూడా తోటి జంతువుల నుంచి, మనుషుల నుంచి సాయం పొందినప్పుడు వాటికి తోచిన విధంగా కృతజ్ఞతలు తెలుపుతాయి.

Elephant
Elephant Says Thank: మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయ పడితే వారికి కృతజ్ఞత తెలుపుతాం. అది మానవుని లక్షణం. అయితే జంతువులు కూడా తోటి జంతువుల నుంచి, మనుషుల నుంచి సాయం పొందినప్పుడు వాటికి తోచిన విధంగా కృతజ్ఞతలు తెలుపుతాయి. తాజాగా ఓ భారీకాయం కలిగిన ఏనుగు తనను కాపాడిన జేసీబీని హత్తుకొని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Elephant Returns Shoe : ఎంత మంచి మనసు.. చిన్నారి షూ తీసిచ్చిన ఏనుగుపై ప్రశంసల వర్షం.. వీడియో వైరల్
గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఏనుగుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ ఏనుగు పెద్ద గుంతలో పడిపోయింది. గుంతలోనుంచి బయటకు వచ్చేందుకు ఏనుగు తీవ్రంగా కృషిచేయడం మనం వీడియోలో చూడొచ్చు. అయినా అది పైకిరాలేక పోతుంది. స్థానికులు ఏనుగు ఇబ్బందిని గమనించి పక్కనే ఉన్న జేసీబీతో దానికి సహాయం అందిస్తారు. తొలుత జేసీబీ డ్రైవర్ ఏనుగు తొండం భాగంలో సపోర్టుగా జేసీబీ లోడర్ బకెట్ ను ఉంచుతాడు. అయినా ఏనుగుకు పట్టుదొరక్క పోవటంతో గుంత నుంచి పైకిరాలేక ఇబ్బంది పడుతుంది. దీంతో జేసీబీ లోడర్ బకెట్ ను ఏనుగు నడుం భాగంలో సపోర్టుగా ఉంచుతాడు. దీంతో ఆ ఏనుగు పైకెక్కుతుంది.
A village in India Rescue Elephant Using Excavator…. And It Wave Back to Thanks pic.twitter.com/B5Wc1LCsq4
— Gabriele Corno (@Gabriele_Corno) August 25, 2022
గుంతలోనుంచి పైకొచ్చిన ఏనుగు కొంతముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చి జేసీబీని తన తొండంతో హత్తుకొని కృతజ్ఞత తెలిపింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ఏనుగును అభినందిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే రెండు లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. అనేక మంది లైక్ లు కొడుతుండగా, కొందరు కామెంట్లతో తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరిలో కొందరు ఏనుగు కృతజ్ఞత తెలిపిన విధానం సూపర్, ఇదొక అద్భుత దృశ్యం అంటూ రీ ట్వీట్లు చేశారు. అయితే ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియపర్చలేదు. భారత్ లోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న సన్నివేశం అంటూ పేర్కొన్నాడు.