Pakistan ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్‌ ఐఎస్‌ఐ కుట్ర

పంజాబ్‌తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్‌ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది.

Pakistan ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్‌ ఐఎస్‌ఐ కుట్ర

Pak Isi

Updated On : May 23, 2022 / 12:01 PM IST

Pakistan’s ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్లాన్‌ చేసినట్లు భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారీ కుట్ర పన్నిందని హెచ్చరికలు జారీ చేశాయి.

పంజాబ్‌తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్‌ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది. సరుకు రవాణా రైళ్లు ఢీకొట్టేందుకు రైల్వే ట్రాక్‌లను పేల్చివేయటానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా సంస్థలు తెలిపాయి.

Amarnath Yatra : అమర్‌నాథ్‌ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు

రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు వెల్లడించాయి.