Calcutta High Court : సెక్షన్ 498-ఎ దుర్వినియోగంపై కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
సెక్షన్ 498-ఎ దుర్వినియోగంపై కోల్‌కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు మహిళలు చట్ట పరమైన ఉగ్రవాదానికి తెర లేపుతున్నారని అభిప్రాయపడింది. ఓ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Calcutta High Court
Calcutta High Court : వరకట్న వేధింపుల నుంచి మహిళల్ని కాపాడటానికి తెచ్చిన చట్టం 498-ఎ పై కోల్‌కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు మహిళలు దీనిని దుర్వినియోగం చేయడం ద్వారా చట్టపరమైన ఉగ్రవాదానికి తెరలేతున్నారంటూ వ్యాఖ్యానించింది. ఓ కేసులో భార్య దాఖలు చేసిన క్రిమినల్ కేసులపై ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు చేసిన అభ్యర్ధనలను కోర్టు విచారించిన నేపథ్యంలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Wedding Day: పెళ్లి రోజునే దంపతులను విడగొట్టిన కేకు.. విడాకుల కోసం కోర్టుకు భార్య
‘సమాజంలో వరకట్న వేధింపుల నుంచి రక్షించడానికి సెక్షన్ 498A నిబంధన అమలు చేయబడింది.. కానీ ఈ నిబంధన దుర్వినియోగం చేయడం ద్వారా కొత్త చట్టపరమైన ఉగ్రవాదానికి తెర లేపుతున్నట్లు అనేక సందర్భాల్లో గమనించవచ్చు. భద్రత u/s 498A ప్రకారం వేధింపులు, చిత్ర హింసలు కేవలం డిఫాక్టో ఫిర్యాదుదారు వల్ల మాత్రమే రుజువు చేయబడవని కోర్టు వెల్లడించింది. రికార్డులోని వైద్య సాక్ష్యం, సాక్షుల వాంగ్మూలాలు, కేసులను ఎదుర్కుంటున్న వ్యక్తి, అతని కుటుంబానికి వ్యతిరేకంగా ఎటువంటి నేరాన్ని నిర్ధారించలేదని’ జస్టిస్ సుభేందు సమంత సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా దిగువ కోర్టు ప్రారంభించిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌లను రద్దు చేసింది.
TS High Court : టీచర్‌ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా..? : ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
ముఖ్యంగా బెంచ్ విచారిస్తున్న జంట పెళ్లైన దగ్గర నుంచి కుటుంబంతో కలిసి కాకుండా విడిగా ఉంటున్నారని.. పిటిషన్‌లో ఫిర్యాదు దారు ఆరోపణలు అన్నీ కల్పితమని.. ఫిర్యాదు చేసిన మహిళపై దాడి, హింస జరగలేదని బెంచ్ పేర్కొంది. చట్టం ఫిర్యాదు దారుని క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేయడానికి అనుమతిస్తుందని.. దానికి తగిన సాక్ష్యాలు జోడిస్తేనే దానిని సమర్ధించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.