Dalits Tortured: కర్ణాటకలో దారుణం.. అప్పు చెల్లించలేదని దళితుల్ని గదిలో బంధించిన యాజమాని.. గర్భం కోల్పోయిన మహిళ

కర్ణాటకలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ కాఫీ ఎస్టేట్ యజమాని, అతని కుమారుడు దళితు కుటుంబాలకు చెందిన పలువురిని లాక్కెళ్లి గృహనిర్భంధం చేశాడు. ఈ క్రమంలో అందులోని ఓ గర్భిణీపై కూడా దాడి చేయడంతో ఆమె గర్భం కోల్పోయింది.

Dalits Tortured: కర్ణాటకలో దారుణం.. అప్పు చెల్లించలేదని దళితుల్ని గదిలో బంధించిన యాజమాని.. గర్భం కోల్పోయిన మహిళ

Dalits Tortured

Updated On : October 12, 2022 / 1:24 PM IST

Dalits Tortured: కర్ణాటకలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ కాఫీ ఎస్టేట్ యజమాని, అతని కుమారుడు దళితు కుటుంబాలకు చెందిన పలువురిని లాక్కెళ్లి గృహనిర్భంధం చేశాడు. ఈ క్రమంలో అందులోని ఓ గర్భిణీపై కూడా దాడి చేయడంతో ఆమె గర్భం కోల్పోయింది. నిందితులను జగదీష్ గౌడ్, అతని కుమారుడు తిలక్ గౌడ్ గా గుర్తించారు. గర్భిణిపై దాడిచేసి, ఆమెతో పాటు మరికొందరిని దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈనెల  8న బాలెహూన్నూరు సమీపంలోని హుణసెహళ్లిపుర గ్రామంలో చోటు చేసుకుంది.

DCW chief gets rape threats: ‘నిన్ను రేప్ చేస్తాం’.. అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతికి బెదిరింపులు

తన కడుపుపై యజమాని తన్నాడని, తనను రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మహిళలు రూప, కవితపై కూడా దాడి చేశాడని, అంతేకాక తన భర్త విజయ్ పై దాడిచేసి ఫోన్ లాక్కున్నారని గర్భిణి అర్పిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత అర్పితకు కడుపునొప్పి రావడంతో అక్టోబర్ 9న యజమాని వాహనంలో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెను చిక్కమగళూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

MiG-29K Aircraft: గోవాతీరంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. సాంకేతిక లోపమే కారణమా?

వారం రోజుల క్రితం పిల్లలతో సంబంధం ఉన్న విషయంపై విజయ్ బంధువులు సతీష్, మంజుకు మరియు గౌడకు చెందిన పొరుగువారి మధ్య గొడవ జరిగింది. ఇది మంజుపై జగదీష్ గౌడ్ దాడికి దారితీసింది. ఆగ్రహంతో మంజు ఇకపై నీ ఎస్టేట్ లో పని చేయమని యజమానితో చెప్పాడు.  జగదీష్ గౌడ్ తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బును ఇవ్వాలని డింమాండ్ చేశారు. గతంలో వీరు రూ. 9లక్షలు జగదీష్ గౌడ్ వద్ద అప్పుగా తీసుకున్నారు. డబ్బులు తరువాత ఇస్తామని చెప్పి వేరే ఎస్టేట్ కు వెళ్లే సమయంలో యాజమాని వారిని తీసుకొచ్చి గదిలో బంధించాడు. ఈ క్రమంలో వారిపై దాడి చేయడంతో అర్పిత గర్భం కోల్పోయింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ముదిగెరె తాలూకాకు చెందిన దళిత కుటుంబాలు గౌడ నుంచి రూ.9 లక్షలు అప్పుగా తీసుకుని గత నాలుగు నెలలుగా ఆయన ఎస్టేట్‌లో పనిచేస్తున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఉమా ప్రశాంత్ చెప్పారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. అయితే, నిందితులను పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఇదిలాఉంటే జగదీష్ గౌడ బీజేపీకి చెందిన వ్యక్తి అని కాంగ్రెస్ పేర్కొంది.