Javed Akhtar: నాస్తికులకు కూడా పండగలు ఉండాలట.. సలహాలు ఇవ్వమంటున్న జావెద్ అఖ్తర్

స్వతహాగా నాస్తికుడైన జావెద్ అఖ్తర్, శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాస్తికులకు ఒక సంవత్సరంలో కనీసం రెండు పండుగలైనా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈ సమయంలోనే నిర్ణయం జరగాలి.

Javed Akhtar: నాస్తికులకు కూడా పండగలు ఉండాలట.. సలహాలు ఇవ్వమంటున్న జావెద్ అఖ్తర్

Javed Akhtar

Updated On : April 22, 2023 / 5:49 PM IST

Javed Akhtar: పండగలు అనేవి మతంలో చాలా సర్వసాధారణంగా ఉంటాయి. మతాలకు సంబంధం లేకుండా కూడా అనేక పండగలు ఉంటాయి. అయితే మతాన్ని విశ్వసించని నాస్తికులకు ప్రత్యేకంగా పండగలు అంటూ ఏమీ ఉండవు. అయితే నాస్తికులకు కూడా ప్రత్యేకంగా పండగలు ఉండాలనే విషయాన్ని ప్రముఖ గీత రచయిత జావెద్ అఖ్తర్ లేవెనెత్తారు. ఏడాదికి కనీసం రెండు పండుగలైనా నాస్తికులకు ఉండాలని ఆయన అంటున్నారు. ఈ విషయమై నెటిజెన్లను ఆయన సూచనలు సలహాలు కోరారు.

PM Modi : ప్రధాని పర్యటనలో ఆత్మాహుతి దాడులు తప్పవని లేఖ .. కేరళలో హైఅలర్ట్‌

స్వతహాగా నాస్తికుడైన జావెద్ అఖ్తర్, శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాస్తికులకు ఒక సంవత్సరంలో కనీసం రెండు పండుగలైనా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈ సమయంలోనే నిర్ణయం జరగాలి. అలా అని మేము ఇతర మతాల పండుగలను జరుపుకోవడం మానేస్తామని కాదు. మతాన్ని విశ్వసించేవారిని కూడా మా పండగలకు ఆహ్వానిస్తాం. మా ఆనందాన్ని కూడా వారితో పంచుకుంటాం. అయితే దీని మీద ఏదైనా ఆలోచనలు ఉంటే పంచుకోవాలని నా తోటి నాస్తికులను కోరుతున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Karnataka Polls: సిట్టింగులను ఎత్తేసిన బీజేపీ.. అమిత్ షా సమాధానం ఏంటంటే?

జావెద్ అఖ్తర్ చేసిన ఈ ప్రతిపాదనకు నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘నిజానికి ఇది మంచి ఆలోచన. పండగ లేదంటే ఏదైన ప్రత్యేకమైన రోజనేది నాస్తికులను ఏకం చేస్తుంది, చైతన్యం పెంచుతుంది. మరింత మంది నాస్తికులు రూపొందేలా చేస్తుంది’’ అని ఒక నెటిజెన్ అన్నారు. ఇక మరికొంత మంది అయితే ‘‘జనవరి 26, ఆగస్టు 15’’ ఈ రెండు రోజులను పండగలా చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ ప్రతిపాదన ఎంత మేరకు పని చేస్తుంది, ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందనేది చూడాలి.