Theft In Wedding : ఐపీఎస్ అధికారి పెళ్లిలో దొంగతనం
రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంటే.. మధ్యప్రదేశ్‌లో వేడుకల్లోకి బంధువుల్లా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

Theft In Wedding
Theft In Wedding : రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంటే మధ్యప్రదేశ్‌లో ఏకంగా ఐపీఎస్ అధికారి ఇంటికే కన్నం వేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని శివపురికి చెందిన ఐపీఎస్ ట్రైనీ అధికారి నరేంద్ర సింగ్ వివాహం వేడుకలోకి దొంగలు చొరబడ్డారు. డిసెంబర్ 6తేదీ నరేంద్ర సింగ్ వివాహం జరిగింది. బంధువులు పెళ్లి మండపంలో ఉన్న సమయంలో విశ్రాంతి గదిలోకి వెళ్లిన దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఖరీదైన వాచ్‌లను కూడా తస్కరించినట్లు తెలుస్తోంది.
చదవండి : Theft : అనంతలో దొంగల బీభత్సం.. టీచర్‌ని హత్యచేసి దోపిడీ
పెళ్లి వేడుక అనంతరం గదిలోకి వెళ్లి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడివున్నాయి. దీంతో దొంగలు పట్టరాని భావించి పెళ్లింటివారికి తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారి పెళ్లిలోనే దొంగతనం జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. దొంగలు చుట్టాల మాదిరిగానే తయారై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సాధారణంగా ఈ ప్రాంతంలో దొంగతనాలు అధికంగా జరుగుతుంటాయి. పెళ్లి వేడుకను టార్గెట్ చేసి దొంగతనం చేయడం ఇక్కడి దొంగలకు వెన్నతో పెట్టిన విద్య.
చదవండి : Fighter jet tyre Theft : ఏకంగా..యుద్ధ విమానం టైర్‌ను దొంగిలించిన దుండగులు
సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే భారీ మొత్తంలోనే దొంగలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.