Chennai Man : 365 మందితో డేటింగ్, 90 ఏళ్ల బామ్మతో కూడా..దీని వెనుక లక్ష్యం ఉంది

ఇప్పటికే 335 మందితో డేటింగ్ అయిపోయింది. ఇంకా 30 మంది ఉన్నారు. ఈయన డేటింగ్ చేసిన వాళ్లలో 88 ఏళ్ల సన్యాసినితో పాటు...90 ఏళ్ల బామ్మ కూడా ఉన్నారు.

Chennai Man : 365 మందితో డేటింగ్, 90 ఏళ్ల బామ్మతో కూడా..దీని వెనుక లక్ష్యం ఉంది

Dating

Updated On : August 15, 2021 / 10:28 AM IST

Chennai Man Date 365 Women : 365 మందితో డేటింగ్ చేయాలి..ఇప్పటికే 335 మందితో డేటింగ్ అయిపోయింది. ఇంకా 30 మంది ఉన్నారు. ఈయన డేటింగ్ చేసిన వాళ్లలో 88 ఏళ్ల సన్యాసినితో పాటు…90 ఏళ్ల బామ్మ కూడా ఉన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా..డేటింగ్ చేయడమే ఇతని పని. గిదేం పని. ఏదో ఉద్యోగం, వ్యాపారం చేసుకోకుండా..అని అంటారా ? కానీ దీని వెనుక ఓ లక్ష్యం దాగి ఉంది. మహిళలతో డేటింగ్ ఎందుకు చేస్తున్నారు ? అతని లక్ష్యం ఏంటీ ? అని తెలుసుకోవాలంటున్నారా ? అయితే..ఇది చదవండి.

Read More : Prabha-Ram Charan: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరో క్రేజీ భారీ మల్టీస్టారర్?

ఇతని పేరు సుందర్ రాము. సౌత్ ఇండియన్. చెన్నైలో ఉంటున్న ఇతని వృత్తి యాక్టర్. మహిళలతో డేటింగ్ చేయాలని అనుకున్నాడు. ఇప్పటి వరకు ఎంత మందితో డేటింగ్ చేశాడు ? వాళ్ల వయస్సు ఎంత ? ఏ దేశానికి చెందిన వారు తదితర వివరాలు ఫేస్ బుక్ లో రాసుకొస్తాడు సుందర్. మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం కోసం డేటింగ్ చేయడం లేదు..దీని వెనుక ఒక లక్ష్యం ఉందంటారు సుందర్ రాము. భారత్ లో మహిళల హక్కుల గురించి అవర్ నెస్ తేవడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నాడితను. అందుకే ఈ డేటింగ్ ను ఎంచుకోవడం జరిగిందని, తాను 2015, జనవరి 01వ తేదీలో 365 డేట్స్ అనే కాన్సెప్ట్ ను స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు.

Read More : Police: పది నిమిషాల్లో పోయిన ఫోన్ పట్టేసుకున్న పోలీసులు

2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనే ఇది చేయడానికి గల కారణమని వివరించారు. ఈ ఘటన జరిగిన అనంతరం తాను కొన్ని రోజుల పాటు నిద్రపోలేదని, మహిళలపై అసలు ఎందుకింత చిన్న చూపు అనే ప్రశ్న తనలో ఉద్భవించిందన్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగిందని, డేటింగ్ లో మహిళలతో కలిసి లంచ్ చేయడం, టీ తాగడం వంటివి చేస్తానన్నారు. మధ్యమధ్యలో మహిళల హక్కుల గురించి చెబుతానని, వాళ్లలో ఒక అవర్ నెస్ తీసుకరావడానికి తాను కృషి చేస్తానన్నారు. టెక్నాలజీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ? కుటుంబ విలువలు ఎలా పతనమౌతున్నాయో వారికి వివరించే ప్రయత్నం చేస్తానంటున్నాడు సుందర్. ఇతని లక్ష్యం తెలుసుకున్న వారు..365 డేట్స్ విజయవంతం పూర్తి కావాలని కోరుకుంటున్నారు.