Corona Restrictions Violation : యూపీలో కరోనా ఆంక్షల ఉల్లంఘన..మాస్క్‌లు పెట్టుకోకుండా మతపెద్ద అంత్యక్రియలకు వేలాది మంది హాజరు

దేశంలో కోరోనా విరుచుకుపడుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కోవిడ్‌ ఆంక్షలను బేఖాతర్‌ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

Corona Restrictions Violation : యూపీలో కరోనా ఆంక్షల ఉల్లంఘన..మాస్క్‌లు పెట్టుకోకుండా మతపెద్ద అంత్యక్రియలకు వేలాది మంది హాజరు

Thousands Of People Attend Funerals Without Wearing Masks In Up

Updated On : May 11, 2021 / 1:42 PM IST

people attend funerals without masks : దేశంలో కోరోనా విరుచుకుపడుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. కోవిడ్‌ ఆంక్షలను బేఖాతర్‌ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అంత్యక్రియల్లో 20 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని ఆంక్షాలు ఉన్నాయి.

కానీ ఉత్తర్‌ప్రదేశ్‌ బదౌన్‌ జిల్లాలో ఓ మతపెద్ద అంత్యక్రియల కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. బదాన్‌ జిల్లాకు చెందిన మతపెద్ద హజ్రత్‌ అబ్దుల్‌ హమీద్‌ మహ్మద్‌ సలీముల్‌ ఖాద్రీ అంతిమయాత్రకు వేలాది మంది హాజరయ్యారు.

ఒక్కరు కూడా మాస్క్‌ పెట్టుకోలేదు. భౌతికదూరం పాటించలేదు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.