లాక్‌డౌన్ మధ్య..ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియలకు వేలాది మంది..కాంగ్రెస్,బీజేపీ నేతలకు కూడా..

  • Published By: nagamani ,Published On : May 19, 2020 / 07:29 AM IST
లాక్‌డౌన్ మధ్య..ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియలకు వేలాది మంది..కాంగ్రెస్,బీజేపీ నేతలకు కూడా..

Updated On : May 19, 2020 / 7:29 AM IST

మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఓ ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాదిమంది  పాల్గొన్నారు. కత్ని జిల్లాలో ఆదివారం (మే 17,2020)  జరిగిన ఈ అంత్యక్రియలకు పాల్గొన్నవారిలో కాంగ్రెస్, బిజెపికి చెందిన రాజకీయ నాయకులు, నటుడు అశుతోష్ రానా వంటి ప్రముఖులు ఉండటం గమనించాల్సిన విషయం.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దేవ్‌ ప్రభాకర్‌ శాస్త్రి(82) దాదాజీగా ప్రసిద్ధి. గత కొంతకాలం నుంచి కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రభాకర్‌ శాస్త్రి ఆదివారం తుదిశ్వాస విడిచారు.. దాదాజీ చనిపోయారనే వార్త తెలుసుకున్న ఆయన భక్తులు.. కత్ని జిల్లాకు వేలాదిగా తరలివచ్చారు.  

ఏమాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులతో పాటు నటుడు అష్‌తోస్‌ రానా కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవికాస్తా వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతూ..ఇటువంటివి రాజకీయనేతలకు వర్తించవా? అంటూ ప్రశ్నిస్తున్నారు.  దీనిపై కత్ని జిల్లా కలెక్టర్‌ షషీ భూషణ్‌ సింగ్‌ స్పందించారు. దాదాజీ అంత్యక్రియల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించారని చెప్పటం విశేషం. 

దాదాజీ భౌతికకాయానికి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీజేపీ జాతీయ జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ, మాజీ సీఎం కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అయితే కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించిన విషయం విదితమే. అంత్యక్రియలకు కేవలం 20 మంది కంటే ఎక్కువ హాజరు కావొద్దని కేంద్రం ఆదేశించింది. కానీ అధికారి పార్టీకి చెందిన వారు కూడా ఈ నిబంధనల్ని బేఖాతరు చేశారు. 

 

Read:  తెలుగమ్మాయిని మెచ్చుకుని,సత్కరించిన ట్రంప్