ఎన్నికలకు ముందే గెలిచారు: ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల్యేలు కావడం ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.. నామినేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవడంతో ఇద్దరు ప్రత్యర్థి అభ్యర్ధుల నామినేషన్‌లను ఈసీ తిరస్కరించింది.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
అలాగే మరో నియోజకవర్గంలో ప్రత్యర్థి అభ్యర్థి నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో బీజేపీ మూడు స్థానాల్లో ఏకగ్రీవం అయ్యింది. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గం నుంచి కెంటో జిని, లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి తబా టెడిర్, పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ నుంచి ఫుర్ప సెరింగ్ బీజేపీ నుంచి ఏకగ్రీవం అయ్యారు.
మిగిలిన 57అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో మెుత్తం 60 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష