India Oxygen Crisis : భారత్‌లో ఆక్సిజన్ తీవ్ర సంక్షోభం వెనుక మూడు కారణాలివే..
కరోనా కోరల్లో విలవిల్లాడిపోతున్న భారత్.. ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం లేదు. దాంతో అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోరుతూ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

India Facing An Acute Oxygen Crisis
India facing an acute oxygen crisis : కరోనా కోరల్లో విలవిల్లాడిపోతున్న భారత్.. ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం లేదు. దాంతో అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోరుతూ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. విమానంలో, రైళ్లల్లో, రోడ్డు మార్గాల్లో సాధ్యమైనంత తొందరగా పెద్ద మొత్తంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అవసరం పడుతోంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో ఢిల్లీ సహా ఇతర నగర ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులకు సరైన సమయంలో ఆక్సిజన్ సరఫరా కాకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే యూనిట్లు దూరంగా ఉండటంతో ఆలస్యం అవుతోంది. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంతో ఆక్సిజన్ సకాలంలో ఆస్పత్రులకు అందించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ముఖ్యమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. దాంతో ఈ వారంలో అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరాకు డిమాండ్ పెరిగింది. పక్క రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ లలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉండటం.. ఆక్సిజన్ సదుపాయాల అవసరం స్థానికంగా భారీగా పెరగడంతో ఈ సమస్య తలెత్తినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఆక్సిజన్ సరఫరా డిమాండ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనంగా మెడికల్ ఆక్సిజన్ కోసం ఢిల్లీ ప్రయత్నిస్తోంది. తూర్పు భారతదేశంలోని పలు పారిశ్రామిక జోన్ల నుంచి ఆక్సిజన్ సరఫరా చేసుకోవాల్సి వస్తోంది.
1. ఎక్కడెక్కడ ఆక్సిజన్ డెలివరీ ఆలస్యమంటే :
దేశ రాజధాని ఢిల్లీకి పలు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా అందుతోంది. ఢిల్లీకి 1000 కిలోమీటర్లు (625మైళ్లు)కు పైగా దూరంలో ఈ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యేకమైన ట్యాంకర్లలో పరిమిత సంఖ్యలో అన్ని లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయాల్సి ఉంది. ఆక్సిజన్ డెలివరీలు సకాలంలో సరఫరా అయ్యేందుకు యాక్షన్ ప్లాన్ అవసరమని గ్యాస్ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇటీవల రోజుల్లో చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ ట్యాంకులను వెళ్లకుండా స్థానిక అధికారులు అడ్డుకోవడం ఆందోళనకు దారితీసింది. ఇలాంటి ఘటనలతో ఢిల్లీలో బుధవారం నాటికి 378 టన్నులు చేరాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు కేవలం 177 టన్నులు మాత్రమే అందినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ రెండు లేదా మూడు వారాలు ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లను ఆర్డర్ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుందో క్లారిటీ ఇవ్వలేదు.
2. ఇండియాలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉందా? :
భారతదేశంలో రోజుకు ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పారిశ్రామిక వినియోగంతో కలిపి కనీసం 7,100 టన్నులు ఉంటుంది. ప్రస్తుతం ఆక్సిజన్ డిమాండ్ కు తగినంత స్థాయిలో లేదనే చెప్పాలి. మొత్తం ఆక్సిజన్ డిమాండ్ 6,785 టన్నులతో పోలిస్తే.. ఈ వారం, దేశంలో అత్యంత నష్టపోయిన 20 రాష్ట్రాలకు రోజుకు 6,822 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ప్రభుత్వం కేటాయించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం వెల్లడించింది. భారత్ లో మొత్తం మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏప్రిల్ 12 నాటికి 3,842 టన్నులుగా ఉంది. గత కొన్ని రోజులుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా 3,300 టన్నులకు పెరిగిందని పీఎం కార్యాలయం పేర్కొంది. స్టీల్ ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక యూనిట్లు తమ ఆక్సిజన్ ఉత్పత్తులను ఇటు మళ్లీస్తున్నాయి.
3. ఆక్సిజన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ ప్లాన్ ఏంటి? :
దేశంలో ఆక్సిజన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం భారత రైల్వేశాఖను రంగంలోకి దింపింది. భారీమొత్తంలో ఆక్సిజన్ ట్యాంకర్లను రిఫిల్లింగ్ ప్లాంట్ల నుంచి రైళ్లల్లో తరలిస్తోంది. పారిశ్రామిక గ్యాస్ ఉత్పత్తిదారు లిండే ఇండియా సహా ఇతర పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వం.. ఎయిర్ ఫోర్స్ కార్గో విమానాలను వినియోగిస్తోంది. కార్గో విమానాల్లో ఖాళీ ట్యాంకర్లను ప్లాంట్ల వద్దకు తరలిస్తోంది.
రిఫిల్లింగ్ చేసిన ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డు మార్గం ద్వారా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నాయి. జర్మనీ నుండి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను సాయుధ దళాలు దిగుమతి చేసుకుంటున్నాయి. చాలావరకు ఇతర పారిశ్రామిక సంస్థలు ఆక్సిజన్ ను ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాయి. టాటా గ్రూపుకు చెందిన సంస్థ 24 ప్రత్యేకమైన కంటైనర్లలో లిక్విడ్ ఆక్సిజన్ తరలిస్తోంది. ఆర్గాన్, నైట్రోజన్ ట్యాంకర్లను ఆక్సిజన్ ట్యాంకర్లుగా మార్చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.