Girl Dead Bodies on Tree: భారత్-నేపాల్ సరిహద్దుల్లో..చెట్టుకు వేలాడుతూ బాలిక మృతదేహాలు..!!
భారత్-నేపాల్ సరిహద్దులో ముగ్గురు అమ్మాయిల మృతదేహాలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయా? వారిది హత్యా? లేదా ఆత్మహత్యా?..

3 Girls Found Dead Hanging From A Tree In India Nepal Border
Girls found dead hanging from a tree : భారత్-నేపాల్ సరిహద్దులో ముగ్గురు అమ్మాయిల మృతదేహాలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఆదివారం (జులై 24,2022) ఝాపా జిల్లాలో కచన్ కావాల్ రూరల్ మున్సిపాలిటీలోని పాతమారిలో ఓ చెట్టుకు ముగ్గురు బాలిక మృతదేహాలు వేలాడుతు కనిపించటం పెను సంచలనంగా మారింది. వీరి మతి పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులకు హుటాహుటినీ ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెట్టు నుంచి మృతదేహాలను దింపి పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. ఆముగ్గురిది హత్యా? లేదా ఆత్మహత్యా..అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై డీఎసపీ బసంత పాఠక్ మాట్లాడుతూ..అనుమానాస్పదంగా చనిపోయిన ముగ్గురు బాలికలు కరీనా గణేష్(16), కల్పనా గణేశ్(16), అంజలి గణేశ్(17)గా గుర్తించామని తెలిపారు. ఈ ముగ్గురు శనివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయారని..ముగ్గురూ సుంకోషి టీ గార్డెన్ లో పనిచేసేవారని తెలిపారు.
నేపాల్-భారత్ సరిహద్దుకు సమీపంలో పాతమరి గ్రామం దగ్గర ఉన్న తేయాకు తోటలోని రేగు చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయని తెలిపారు. ఇది ఆత్మహత్య కేసు అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని..తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.