Tiger with Monkey: చెట్టెక్కిన పులికి కోతి ఝలక్.. ‘బలంతో ఆడాలి-బలహీనతలతో కాదు’

చెట్టు ఎక్కిన పులి తన బలాన్ని పక్కకుపెట్టి కోతి ఆటలోకి వెళ్లింది. ఇంకేముందు అంతెత్తు నుంచి అమాంతం చతికిలబడింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ 30 సెకన్ల వీడియో..

Tiger with Monkey: చెట్టెక్కిన పులికి కోతి ఝలక్.. ‘బలంతో ఆడాలి-బలహీనతలతో కాదు’

Tiger With Moneky

Updated On : April 12, 2021 / 3:28 PM IST

Tiger with Monkey: చెట్టు ఎక్కిన పులి తన బలాన్ని పక్కకుపెట్టి కోతి ఆటలోకి వెళ్లింది. ఇంకేముందు అంతెత్తు నుంచి అమాంతం చతికిలబడింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ 30 సెకన్ల వీడియో గురించి మీరూ తెలుసుకోండి.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్.. ప్రవీణ్ అంగుసామీ ఈ పోస్టుపై ‘బలహీనతలతో కాదు.. మీ బలాలంటే తెలుసుకుని ఆడండి’ అంటూ పోస్టు చేశాడు. వీడియోలో కోతి సన్న కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంది. దానికి కాస్త దూరంలో పెద్ద పులి ప్రశాంతంగానే చూస్తున్నా కోతిని పట్టుకోవాలని టార్గెట్ చేసింది.

ఒక్క పంజా విసిరి కోతి ప్రాణం తీసేయాలని యత్నించింది కానీ, తాను ఉన్న ప్రదేశం గురించి మర్చిపోయింది. చూసిచూసి ఒక్కసారిగా ముందుకు దూకి కోతిని అందుకోబోయి పట్టుకోల్పోయింది. అంతే కిందకు పడిపోయింది. నేల బలంగా తాకడంతో పైనున్న కోతిని చూసుకుంటూ నిదానంగా అరుస్తూ కూర్చుండిపోయింది.

ఈ వీడియో ట్విట్టర్లో మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ సర్క్యులేట్ అవుతుండటంతో చాలా స్పందన రాబట్టింది. కోతి తెలివితేటలతో పాటు వీడియో తీసిన కెమెరామెన్ కు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అసలు బలాన్ని బలహీనతను ఎలా తెలుసుకోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇంకొకరేమో పులి కింద పడిపోయి ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూసుకుంటుందని కామెంట్ చేశారు.