మీ ఫోన్‌లో సిగ్నల్ పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

వేలకువేలు.. లక్షలక్షలు పోసి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు కొంటారు.. కొన్న ఫోన్లో ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంటే తెగ వర్రీ అయిపోతుంటారు. అలాంటిది లక్షలు పోసిన కొత్త ఐఫోన్లు లేదా ఇతర స్మార్ట్ ఫోన్లలో నెట్ వర్క్ సిగ్నల్ సరిగా లేదంటే చిరాకు పుట్టిస్తుంది.. మొబైల్ డేటా నెట్ వర్క్ సెల్ సిగ్నల్ ఆధారంగానే పనిచేస్తుంది.. ఏదైనా ఫేవరెట్ షో స్ట్రీమింగ్ సమయంలో బ్యాడ్ సిగ్నల్ కారణంగా స్ట్రీమింగ్ బాగా స్లో అయిపోతుంది.
ఇలాంటి పరిస్థితిని మొబైల్ ఫోన్లు వాడే యూజర్లలో చాలామంది ఎదుర్కొనే ఉంటారు. నెట్ వర్క్ పరిధిలో లేకపోవడం, కాల్ చేస్తే వెంటనే కట్ అయిపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మొబైల్ యూజర్లు బ్యాడ్ సిగ్నల్ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కొన్ని టిప్స్ ఫాటిస్తే చాలు.. మీరువాడే ఫోన్లలో నెట్ వర్క్ సిగ్నల్ ఐదు బార్స్ రావడం లేదా? సిగ్నల్ డెడ్ అయినట్టుగా కనిపిస్తుందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. బ్యాడ్ సిగ్నల్ పోయి బెస్ట్ సిగ్నల్ పొందవచ్చు. అది ఎలానో చూద్దాం..
1. సిగ్నల్ రాకపోవడానికి కారణం ఏంటో గుర్తించండి :
సెల్ సిగ్నల్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మీ ఫోన్ ఉన్న ప్రదేశంతో పాటు ఎక్కువ మంది జనంలో ఉన్నప్పడు, మీ ఇంటి మెటేరియల్స్, కారులో ఉన్నప్పుడు, జియోగ్రాఫిక్ లొకేషన్ మీ సెల్ సిగ్నల్ సామర్థ్యాన్ని గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిలో దేని కారణంగా మీ ఫోన్ సిగ్నల్ రావడం లేదో గుర్తించాల్సిన అవసరం ఉంటుంది.
2. సిగ్నల్ ఉండే లొకేషన్‌కు వెళ్లాలి :
మీ ఇంట్లో లేదా ఆఫీసులో సెల్ సిగ్నల్ చాలా తక్కువగా ఉన్నట్టుయితే.. అదే బయటకు రాగానే సిగ్నల్ అమాంతం పెరిగిపోతుంది. ఎత్తైనా భవనాల కారణంగా కూడా మీ ఇంట్లో ఫోన్ సిగ్నల్ రాకపోవచ్చు. ఒకవేళ మీరు భవనం బయట ఉన్నప్పటికీ కూడా సిగ్నల్ సమస్య ఉండొచ్చు. ఎత్తైనా భవనాలు, చెట్ల వంటివాటికి దూరంగా వెళ్లడం ద్వారా సిగ్నల్ సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది.
అందుకే ఎత్తైనా ప్రదేశాలకు వెళ్లాలి.. అప్పుడే కాస్తా సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది. కచేరీలు, మ్యూజిక్ ఫెస్టివల్స్ సమయంలో భారీగా జనం గుంపుగా ఉన్న ప్రదేశంలో లేదా లోతైనా ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వైర్ లెస్ టవర్లపై ప్రభావాన్ని చూపిస్తాయి. తద్వారా మీ ఫోన్లలో పరిమిత సిగ్నల్, డేటా స్పీడ్ తగినంత స్థాయిలో ఉండదు.
3) మీరు ఉండే ప్రాంతంలో కవరేజ్ సమస్యలున్నాయో చెక్ చేశారా?
మీ దగ్గరగా ఉండే నెట్ వర్క్ ఆఫీసు దగ్గరకు వెళ్లి కవరేజ్ సమస్యలు ఉన్నాయా లేదో చెక్ చేయండి. టవర్ నుంచి సిగ్నల్ డౌన్ అయిందా లేదా ఏదైనా ఒక టవర్ అండర్ మెయింట్ నెన్స్ లో ఉందా? అని చెక్ చేయాలి.. సంబంధిత నెట్ వర్క్ సిబ్బందికి ఫిర్యాదు చేసి సిగ్నల్ కవరేజ్ సమస్యను అధిగమించవచ్చు.
4) ఫోన్ సిగ్నల్ రీఫ్రెష్… రీబూట్ చేయండి :
కొన్నిసార్లు మీ ఫోన్లో నెట్ వర్క్ కవరేజ్ సమస్య ఉన్నప్పుడు అది సెర్చింగ్ నెట్ వర్క్ అలానే కనిపిస్తుంటుంది. దగ్గరలోని సెల్ టవర్ కు కనెక్ట్ కాకపోవడంతో ఫోన్ స్టక్ అయిపోతుంటుంది. వీక్ సిగ్నల్ కనిపిస్తుంటుంది. స్ట్రాంగ్ సిగ్నల్ రావాలంటే మాత్రం ఓసారి సిగ్నల్ రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ పూర్తిగా రీబూటింగ్ (షట్ డౌన్ చేసి స్విచ్ ఆన్) చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. లేదా ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్ చేయండి. ఒక సెకన్ లేదా కొన్నిసెకన్ల పాటు అదే మోడ్ లో ఉంచి ఆ తర్వాత మళ్లీ Airplane mode ఆఫ్ చేయండి.. సిగ్నల్ రీఫ్రెష్ అయి ఫుల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది.
5) వైర్ లెస్ సిగ్నల్ రీపిటర్ ఇన్‌స్టాల్ చేయండి :
మీరు ఫోన్ ఎక్కువగా వాడే ప్రదేశాల్లో ప్రత్యేకించి ఇళ్లు లేదా కారులో వైర్ లెస్ సిగ్నల్ రీపిటర్ ఇన్‌స్టాల్ చేసేందుకు ప్రయత్నించాలి. పవర్ సౌకర్యం ఉన్న ప్రతిచోట ఇది ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఉన్న ప్రాంతంలో ఫోన్ సిగ్నల్ వీక్ గా ఉన్నా కూడా ఈ రీపిటర్ ద్వారా ఇన్ కమింగ్ సిగ్నల్స్ క్యాచ్ చేస్తుంది. మీ ఫోన్లో సిగ్నల్స్ పెరిగేలా ఇది సహకరిస్తుంది.
6) మీ నెట్ వర్క్ కవరేజ్ మ్యాప్ చెక్ చేయండి :
మీ ఫోన్ ఉన్న ప్రదేశంలో సెల్ సిగ్నల్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. వైర్ లెస్ ప్రొవైడర్లు (verizon, sprint, AT&T, T-mobile) ద్వారా అన్ని ప్రాంతాల్లోని పూర్తి కవరేజ్ మ్యాప్ ఆఫర్ చేస్తున్నాయి. సెల్ సిగ్నల్ లేని ప్రదేశాల్లో తమ నెట్ వర్క్ కవరేజీ ద్వారా సిగ్నల్ అందేలా సహకరిస్తున్నాయి. మీ ప్రదేశంలో ఈ నెట్ వర్క్ కవరేజ్ ఉంటే.. సులభంగా స్విచ్ అవ్వొచ్చు.
Also Read | ఇబుప్రోఫెన్ vs పారాసెటమాల్: కరోనా లక్షణాలు కనిపిస్తే ఏ టాబ్లెట్ తీసుకోవాలి!