TMC-Congress: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన టీఎంసీ
బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కొంత మంది ఆశిస్తున్నారు.

TMC gave clarity on alliance with Congress party
TMC-Congress: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఒక బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ విషయమై కొంత మంది నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కొంత మంది ఆశిస్తున్నారు.
Karnataka: అరటిపళ్లు, చిక్కీ కాదు గుడ్లు కావాలి.. 80% స్కూలు పిల్లల అభిప్రాయమిది
ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై టీఎంసీ-త్రిపుర అధ్యక్షుడు పీయూష్ కాంటి బిశ్వాస్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని దీదీ తేల్చి చెప్పారు. తొందరలోనే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కొంత కాలం క్రితం జరిగిన త్రిపుర స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన టీఎంసీ.. ఏమాత్రం ప్రభావం చూపలేక బొక్క బోర్లా పడ్డారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీతో అయినా పొత్తులో వెళ్తారనే ఊహాగాణాలు వచ్చాయి. కానీ, ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని బిశ్వాస్ ప్రకటించేశారు.
ఇంతటితో ఆగకుండా.. త్రిపురలో విపక్ష పార్టీ అయిన సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టినా బెంగాల్ ఫలితాలే రిపీట్ అవుతాయని ఆయన అన్నారు. త్రిపురలో గెలిచే అవకాశాలున్న సీట్లలో టీఎంసీ పోటీ చేస్తుందని, పొత్తుకోసం వేరే పార్టీలు ముందుకు వస్తే టీఎంసీ స్వాగతిస్తుందని తెలిపారు. రెండ్రోజుల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ ఫిబ్రవరి 6న త్రిపుర వస్తారని, రోడ్‌షోలో పాల్గొంటారని చెప్పారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం ఫిబ్రవరి 2న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బిశ్వాస్ తెలిపారు.