Covid-19 : దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 మందికి కరోనా సోకింది. 417 మంది మృతి చెందారు

Covid-19 : దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు

Covid 19 (2)

Updated On : August 16, 2021 / 10:39 AM IST

Covid-19 : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,31,342 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక తాజా కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది.

ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. ఆగస్టు 15 న 11,81,212 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 49,48,05,652 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో టీకా డ్రైవ్‌లో భాగంగా 54.58కుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.