INS Vikrant: ఆ దేశాల సరసన నిలిచాం… ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికే గర్వకారణం: ప్రధాని మోదీ
ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికే గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ చేరిన విషయం తెలసిిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఐఎన్ఎస్ విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పారు. ప్రపంచ పటంలో భారత్ ను ఈ నౌక సమున్నత స్థితిలో నిలుపుతుందని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ సాతంత్ర్య సమరయోధుల కలలకు సాకారంగా నిలుస్తుందని చెప్పారు. సొంతంగా వాహక నౌకను అభివృద్ధి చేసిన దేశాల సరనస నిలిచామని తెలిపారు.

INS Vikrant
INS Vikrant: ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికే గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ చేరిన విషయం తెలసిిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఐఎన్ఎస్ విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పారు. ప్రపంచ పటంలో భారత్ ను ఈ నౌక సమున్నత స్థితిలో నిలుపుతుందని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ సాతంత్ర్య సమరయోధుల కలలకు సాకారంగా నిలుస్తుందని చెప్పారు.
భారత కృషికి నిదర్శనంగా ఈ నౌక నిలుస్తుందని తెలిపారు. మన దేశం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని అన్నారు. సొంతంగా వాహక నౌకను అభివృద్ధి చేసిన దేశాల సరనస నిలిచామని తెలిపారు. దేశానికి కొత్త భరోసా ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా సాధ్యమని చెప్పారు. దీని నిర్మాణంలో పాల్గొన్న అందరికీ అభినందనలని అన్నారు. కేరళ తీరంలో ఇవాళ నవశకం ప్రారంభమైందని చెప్పారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌక మన దేశ శక్తికి ఐకాన్ గా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 1971 యుద్ధ సమయంలో విక్రాంత్ నౌక కీలక పాత్ర పోషించిందని చెప్పారు. విక్రాంత్ కు ఆధునిక రూపమే ఐఎన్ఎస్ విక్రాంత్ అని అన్నారు. కాగా, భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్-విక్రాంత్ (1971) పేరుతో ఈ యుద్దనౌకకు పేరు పెట్టారు.