Delhi : పబ్లిక్‌లో బైక్ మీద జంట రొమాన్స్.. రియాక్టైన ట్రాఫిక్ పోలీసులు
ఇటీవల కాలంలో ప్రేమ జంటలు పబ్లిక్‌లో బరి తెగిస్తున్నారు. బైక్ ల మీద వేగంగా వెళ్లడమే కాకుండా రొమాన్స్ చేస్తున్నారు. ఢిల్లీలో వరుసగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో పబ్లిక్ మండి పడుతున్నారు.

Delhi
Delhi : ఇటీవల కాలంలో ప్రేమ జంటలు బైక్‌లపై వేగంగా వెళ్లడం.. వీడియోలు చేయడం.. చివరికి పబ్లిక్‌లో రొమాన్స్ చేయడం కూడా సాధారణం అయిపోయింది. బైక్‌పై వేగంగా వెళ్తూ రొమాన్స్ చేస్తున్న ఓ జంట వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఢిల్లీ పోలీసులు రియాక్ట్ అయ్యారు.
New Delhi : బైక్ నడుపుతూ కౌగిలింతలు.. ఢిల్లీలో ప్రేమ జంట తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
బైక్ మీద వేగంగా వెళ్లడం.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న యువత పరిస్థితిని గమనిస్తున్నాం. ఇక బైక్‌లతో విన్యాసాలు చేస్తూ ఆసుపత్రి పాలైన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో పబ్లిక్‌లో బైక్ మీద వెళ్తూ రొమాన్స్ చేస్తున్న జంటల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లై ఓవర్ మీద ఓ జంట బైక్ మీద వెళ్తూ రొమాన్స్ చేసుకోవడం @Buntea అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో యువతి పెట్రోల్ ట్యాంక్‌పై తన లవర్‌కి ఎదురుగా కూర్చుని ఉంది. ఇద్దరు ఒకరిని నొకరు గాఢంగా కౌగిలించుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వారి అసభ్య ప్రవర్తనపై మండిపడుతున్నారు.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువకుడిని తిట్టి, చెంప దెబ్బ కొట్టిన మహిళ వీడియో వైరల్
ఈ వీడియోపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ‘ధన్యవాదాలు ఇటువంటి ట్రాఫిక్ ఉల్లంఘన ఘటనలు ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ‘సెంటినల్ యాప్’లో నివేదించాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాము’ అనే శీర్షికతో పోస్టు చేశారు. ”సార్ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. పబ్లిక్ ప్లేస్‌లను ఇలాంటి అశ్లీలత కలుషితం చేస్తుంది’ అని .. ‘మహిళ హెల్మెట్ ధరించలేదు.. ఇద్దరిని అరెస్ట్ చేయండి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. గత నెలలో ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో NH9 పై ఇదే విధంగా బైక్ మీద వెళ్తూ జంట రొమాన్స్ చేయడం కనిపించింది. యూత్‌లో కొందరు చేస్తున్న ఇలాంటి చర్యలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Idiot’s of Delhi
Time – 7:15pm
Day – Sunday 16-July
Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5— ????? ????? ?️? (@Buntea) July 16, 2023