స్వీట్ వార్నింగ్ : పంజాబీ ట్రాఫిక్ పోలీస్‌ మెసేజ్ సాంగ్ 

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 04:00 AM IST
స్వీట్ వార్నింగ్ : పంజాబీ ట్రాఫిక్ పోలీస్‌ మెసేజ్ సాంగ్ 

Updated On : September 4, 2019 / 4:00 AM IST

కొత్త ట్రాఫిక్ నిబంధనలు. ఉల్లంఘిస్తే జేబులకు చిల్లే. పోలీస్ యంత్రాంగం ఎంతగా చెప్పినా పట్టించుకోని ప్రజలు మోటార్ వాహనాల చట్టం సవరణ అనంతరం కూడా అదే దూకుడు కొనసాగిస్తే నెల జీతం చలాన్లకు సమర్పించుకోవాల్సిందే. అయినా సరే మా ఇష్టమొచ్చినట్లుగా ఉంటామంటే డబ్బులు కట్టేస్తే పోలా అనుకుంటూ కూడా కుదరదు. జైలుకు వెళ్లాల్సి పరిస్థితి కూడా రావచ్చు. ఇటువంటి దూకుడు బాబులు కోసం ఓ ట్రాఫిక్ పోలీస్ తన పాట ద్వారా సందేశాన్నిస్తున్నారు.  చండీగఢ్ లో ట్రాఫిక్ పోలీస్ భూపిందర్ సింగ్ తన పాటతో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తెలియజేస్తున్నారు.  

మోటార్ వాహనాల  చట్టం సవరణ అనంతరం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించొద్దంటూ పంజాబ్ పోలీస్ అధికారి చండీగఢ్ లో విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు ‘18 ఏళ్లలోపు యువత వాహనాలను నడపొద్దంటూ తన పాట ద్వారా విజ్నప్తి చేస్తున్నారు. లేదంటూ లేదంటే తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందంటూ సూచిస్తున్నారు. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఫైన్లు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘటనలు పాటించటం లేదు. దీంతో ప్రజలకు భయం లేకుండా పోతోంది. ఇప్పుడు ఫైన్లు పెరిగాయి. అందుకని ఎవ్వరూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దంటూ..’ అంటూ పాటతో అందరినీ అప్రమత్తం చేశారు. ఈ వీడియోను చంఢీగఢ్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.