షాకింగ్ వీడియో, కారు బ్యానెట్ పై ట్రాఫిక్ పోలీసు

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 12:46 PM IST
షాకింగ్ వీడియో, కారు బ్యానెట్ పై ట్రాఫిక్ పోలీసు

Updated On : October 15, 2020 / 1:00 PM IST

Traffic Police personnel in Delhi : కారు నడుపుతూ..నిబంధనల్లు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసు సాహసమే చేశాడు. అడ్డుకొనేందుకు కారు బ్యానెట్ పై ఎక్కాడు. కానీ..ఆపాల్సింది పోయి..కొన్ని మీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ డ్రైవర్ పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.



ఢిల్లీలోని దౌలాఖాన్ ప్రాంతం అది. విపరీతమైన రద్దీ నెలకొంది. వాహనాలు రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాయి. ఈ సమయంలోనే..కారు బ్యానెట్ ను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసు కనబడ్డాడు. కారు డ్రైవర్ అటు..ఇటు తిప్పుతూ..అతడిని కిందపడే ప్రయత్నం చేశాడు.



వాహనాల రద్దీ మధ్యే ఇది చోటు చేసుకుంది. చివరకు బ్యానెట్‌పై ఉన్న ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై కింద‌ప‌డ్డాడు. వెనుక నుంచి వాహనం రాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత..కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది.