Mumbai Tragedy : తీవ్ర విషాదం.. పక్షిని కాపాడబోయి ఇద్దరు మృతి.. వీడియో వైరల్

గాయపడ్డ ఓ పక్షి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటం వారి ప్రాణాలనే తీసింది. పక్షి పట్ల వారు చూపిన జాలి, దయ వారి పాలిట మృత్యువుగా మారింది. తిరిగి రాని లోకాలకు పంపింది.

Mumbai Tragedy : తీవ్ర విషాదం.. పక్షిని కాపాడబోయి ఇద్దరు మృతి.. వీడియో వైరల్

Mumbai Tragedy (2)

Updated On : June 11, 2022 / 5:21 PM IST

Mumbai Tragedy : గాయపడ్డ ఓ పక్షి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటం వారి ప్రాణాలనే తీసింది. పక్షి పట్ల వారు చూపిన జాలి, దయ వారి పాలిట మృత్యువుగా మారింది. తిరిగి రాని లోకాలకు పంపింది.

పక్షి ప్రాణాలను కాపాడబోయి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ముంబైలో జరిగింది. బాంద్రా-వర్లీ సీ లింక్ రోడ్డుపై ప్రమాదవశాత్తు ఓ పక్షి కారు కింద పడి గాయాలపాలైంది. కారులోని వ్యాపారవేత్త జరివాలా, డ్రైవర్ శ్యామ్ సుందర్ కమత్ కారు దిగారు. గాయపడ్డ పక్షిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఊహించని దారుణం జరిగింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్యాక్సీ వారిని ఢీకొట్టింది. ఆ ఇద్దరు ఎగిరి అంత దూరం పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఇద్దరూ మరణించారు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినోళ్లు అయ్యో పాపం అని కంటతడి పెడుతున్నారు.

మే 30వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరిని వ్యాపారవేత్త అమర్ మనీశ్ జరివాలాగా(43) గుర్తించారు. ఆయన తన కారులో మలాడ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే అమర్ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. కారు డ్రైవర్ శ్యామ్ సుందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రాందా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ రవిందర్ కుమార్ జైస్ వర్(30) పై కేసు నమోదు చేశారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఇద్దరి మరణానికి కారణమైనందుకు అరెస్ట్ చేశారు.

వైరల్ వీడియో:పిల్లలకోసం ప్రాణాలకు తెగించిన తల్లిపక్షి..అమ్మప్రేమకు తలవంచిన రైతన్న

ఓ పక్షి ప్రాణాన్ని కాపాడే క్రమంలో ఇద్దరి ప్రాణాలు పోవడం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని కన్నీటిపర్యంతం అవుతున్నారు.