ముందు తల్లి.. తర్వాత ఐదుగురు కొడుకులను బలితీసుకుంది… ఒకే కుటుంబంలో ఆరుగురిని మింగేసిన కరోనా

  • Published By: sreehari ,Published On : July 22, 2020 / 08:18 PM IST
ముందు తల్లి.. తర్వాత ఐదుగురు కొడుకులను బలితీసుకుంది… ఒకే కుటుంబంలో ఆరుగురిని మింగేసిన కరోనా

Updated On : July 22, 2020 / 9:42 PM IST

కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని కాటేసింది. వరుసగా ఐదుగురిని కరోనా బలితీసుకుంది. కన్నతల్లిని కూడా పొట్టనబెట్టుకుంది. ఆమె కూడా కరోనాతోనే.. ఇలా రెండు వారాల వ్యవధిలో ఆమెతో పాటు ఐదుగురు కొడుకులు కరోనాతో మరణించారు.

ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని ఒక కుటుంబంలో
జరిగింది. ముందుగా 88 ఏళ్ల వృద్ధురాలు జూలై 4న బొకారోలోని ఒక నర్సింగ్ హోమ్‌లో కన్నుమూసింది. ఆ తరువాత, ఆమె కుమారుల్లో 65 ఏళ్లు ఒకరు, 67 ఏళ్లు, 72 ఏళ్లు, 70 ఏళ్లు, 60 ఏళ్ల కుమారులు కూడా పలు COVID-19 ఆస్పత్రుల్లో 10 రోజుల వ్యవధిలో మృతిచెందారు.
Tragedy Strikes As Mother, Her Five Sons Die Of COVID-19 Within Two Weeks In Jharkhandఆమె కుమారుల్లో ఒకరు క్యాన్సర్‌తో మరణించారు. COVID-19 వ్యాప్తితో ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యులు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్ అనే తేలింది. కానీ, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని ధన్బాద్ సివిల్ సర్జన్ గోపాల్ దాస్ పేర్కొన్నారు.

మహిళ ఏడుగురు కుమారుల్లో ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారు. చిన్న కుమారుడు ఢిల్లీ నుంచి తిరిగి రాగా.. కోల్‌కతాలో కుమార్తె స్థిరపడిందని బంధువులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మొత్తం ఆమె కుటుంబం కరోనా వైరస్ సోకి ఒకరితర్వాత మరొకరు మృతిచెందారు.

రాంచీ రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్) లో కోవిడ్ -19తో ఐసియులో చేరిన వృద్ధురాలి 71 ఏళ్ల కుమారుడు ఆస్పత్రి మరుగుదొడ్డిలో కుప్పకూలి మరణించాడు. ఆస్పత్రిలో ఐసీయూలో కరోనా చికిత్స పొందుతున్న బాధితుడిని ఎవరూ గమనించలేదు.

మృతదేహం రెండు గంటలకు పైగా వాష్ రూంలోనే ఉందని, వృద్ధురాలి కుటుంబంలో ఇదే చివరి మరణంగా గోపాల్ దాస్ తెలిపారు. వివాహ వేడుకకు ముందు సాయంత్రం వృద్ధురాలు అనారోగ్యానికి గురైంది. పక్కనే ఉన్న బొకారో జిల్లాలోని చాస్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. జూలై 4న ఆమె మరణించింది.

హిందూ ఆచారాలతో దహన సంస్కారాలు జరిపించారు. COVID పాజిటివ్ రిపోర్ట్ ఆమె మరణించిన మూడు రోజుల తరువాత వచ్చింది. జూలై 8న, ఆమె 69 ఏళ్ల కుమారుడు, కొమొర్బిడిటీస్‌గా గుర్తించారు. వైరస్ పాజిటివ్ పరీక్షించి ధన్బాద్‌లో ఆస్పత్రిలో చేరాడు.

65 ఏళ్ల సోదరుడిని తీసుకోవడానికి కొన్ని గంటల ముందు జూలై 11న మరణించాడు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న అతన్ని ధన్బాద్‌లోని పట్లిపుత్రా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH)లో చేర్పించారు. జూలై 12 తెల్లవారుజామున అతడు మృతిచెందాడు.

మరుసటి రోజున అతడిలోనూ కోవిడ్ -19 పాజిటివ్ ఉందని తేలింది. అదే రోజు సాయంత్రం 72 ఏళ్ల కుమారుడు వైరస్‌కు పాజిటివ్ అని తేలిన తర్వాత ఆస్పత్రిలో మరణించాడు. ఈ ముగ్గురిని జూలై 13న దహనం చేశారు.

జూలై 16న మరణించిన వ్యక్తి మృతదేహం దహన సంస్కారాల కోసం PMCH మార్చురీలో ఉంది. భయంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. జూలై 19న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 60 ఏళ్ల కుమారుడు 3 రోజుల తరువాత ఆస్పత్రిలో మరణించాడు. వృద్ధురాలి మొత్తం సంతానం ఏడుగురిలో ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారు.