Odisha Train Incident : ఒడిశాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ ప్రెస్..
సీనియర్ రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.

Odisha Train Incident : ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. నెరుగుండి కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు, పలువురు గాయపడ్డారు. కటక్ లోని నెరుగుండి రైల్వే స్టేషన్ సమీపంలో కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు.
Also Read : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ రూల్స్.. వేతనజీవులపై ఎంతగా ప్రభావం ఉంటుందంటే? ఫుల్ డిటెయిల్స్..
ట్రైన్ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వారికి ప్లాట్ ఫామ్ మీదే చికిత్స అందిస్తున్నారు. సీనియర్ రైల్వే అధికారులు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా రూట్లను మళ్లించారు.
”ట్రైన్ నెంబర్ 12551 బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకి చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. కటక్-నెర్ గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటల 54 నిమిషాలకు రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు-కామాఖ్య ఏసీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాం. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా ఫైర్ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంది. రైలు బెంగళూరు నుంచి అస్సాంలోని కామాఖ్య స్టేషన్ కు వెళ్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. మరో రైలుని ఘటనా స్థలానికి పంపించాం. ప్రయాణికులు వారి వారి గమ్య స్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశాం. వీలైనంత తొంతరగా రైల్వే లైన్ ను పునరుద్దరించడంపై దృష్టి పెట్టాం. ఆ రూట్ లో వెళ్లే రైళ్లను దారి మళ్లించాం.
Also Read : బాబోయ్.. బాదుడే బాదుడు.. బ్యాంకుల హిడెన్ చార్జీల గురించి తెలుసా..? చార్జీలు పడకుండా ఇలా తప్పించుకోండి..!
దౌలి ఎక్స్ ప్రెస్, నీలాచల్ ఎక్స్ ప్రెస్, పురులియా ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించాం. రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు (8455885999, 8991124238) ఇచ్చింది. ఏదైనా సాయం కోసం ప్రయాణికులు ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు” అని ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు.