తప్పిన ప్రమాదం : డ్రైవర్ లేకుండానే 50 కిమీ రైలు ప్రయాణం

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 02:24 AM IST
తప్పిన ప్రమాదం : డ్రైవర్ లేకుండానే 50 కిమీ రైలు ప్రయాణం

Updated On : September 18, 2019 / 2:24 AM IST

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఆగిన ఓ గూడ్స్ రైలు… డ్రైవర్ లేకుండానే ఉన్నట్టుండి కదిలింది. స్పీడ్ గా పరుగులు పెట్టింది. దీన్ని గమనించిన అధికారులు షాక్ తిన్నారు. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

వెంటనే తర్వాతి స్టేషన్లను అప్రమత్తం చేశారు. దారిలో ఉన్న రైల్వే గేట్లన్నింటిని మూసేశారు. రైలు పట్టాలపై రాళ్లు, బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి సోజాత్ స్టేషన్ దగ్గర రైలు దానంతట అదే ఆగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పినందుకు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. అసలేం జరిగింది, రైలు ఎలా కదిలింది అనే దానిపై దర్యాఫ్తు చేపట్టారు. భవిష్యత్ లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు.