Hijab: హిజాబ్ వేసుకుని పాఠశాలలోకి ఎందుకు వెళ్తున్నారంటూ.. స్కూల్ ముందు..
ఓ బాలుడిని కొడుతున్న సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.

Hijab Row
Hijab – Tripura Girls: హిజాబ్ వేసుకుని పాఠశాలలోకి ఎందుకు వెళ్తున్నారంటూ కొందరు విద్యార్థినులను కొందరు యువకులు అడ్డుకున్నారు. ఆ అమ్మాయిలకు మద్దతుగా మాట్లాడిన ఓ అబ్బాయిపై దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగి, పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీసేలా మారాయి.
త్రిపురలోని సెపాహిజలా జిల్లా బిషల్‌గఢ్ సబ్‌డివిజన్ లో చోటుచేసుకుంది. విద్యార్థినులు పాఠశాల యూనిఫాంలో మాత్రమే బడిలోకి వెళ్లాలని, హిజాబ్ ధరించకూడదని కొందరు యువకులు అడ్డుచెప్పారు. ఆ సమయంలో పదో తరగతి బాలుడు హిజాబ్ కు మద్దతుగా మాట్లాడడంతో అతడిని కొట్టారు.
ఆ బాలుడిని కొడుతున్న సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. పాఠశాల ముందు జరిగిన ఈ ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మీడియాతో పాఠశాల హెడ్‌మాస్టర్ మాట్లాడుతూ… విశ్వహిందూ పరిషత్ కు చెందిన కొందరు విద్యార్థులు వారం క్రితం కూడా తన వద్దకు వచ్చారని, కొందరు అమ్మాయిలు హిజాబ్ ధరించి ఎందుకు వస్తున్నారని అడిగారని చెప్పారు.
పాఠశాలలో హిజాబ్ ధరించకుండా నిషేధం విధించాలని కోరారని చెప్పారు. హిజాబ్ ధరించకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏవీ లేకపోవడంతో తాము నోటి మాటగానే హిజాబ్ ధరించకూడదని బడిలో చెప్పామని అన్నారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.
Murrel Fish : నూతన టెక్నాలజీతో కొరమేను పిల్లల ఉత్పత్తి ..తక్కువ సమయంలోనే అధిక దిగుబడి అంటున్న రైతు