మోడీ భారత జాతిపిత : ట్రంప్ పొగడ్తల వర్షం

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 01:27 AM IST
మోడీ భారత జాతిపిత : ట్రంప్ పొగడ్తల వర్షం

Updated On : September 25, 2019 / 1:27 AM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌…భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ను భారత జాతిపితగా అభివర్ణిస్తూ సంచలన ప్రశంసలు చేశారు.
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చించిన వీరిద్దరు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హౌడీ మోడీ సభకు వచ్చినందుకు ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 

భారత్‌కే కాకుండా ట్రంప్ తనకు కూడా మంచి మిత్రుడని మోడీ అన్నారు. త్వరలోనే రెండు దేశాలు మరో వాణిజ్య ఒప్పందం చేసుకోంటాయని తెలిపారు. దాంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడించారు.

పొరుగుదేశమైన పాకిస్తాన్ అంశంపై కూడా చర్చించారు. చర్చలకు తాము  విముఖం కాదని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యల వల్ల గత 30 ఏళ్లలో 42 వేల మంది బలయ్యారని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. చర్చలకు తాము వెనుకడుగు వేయడం లేదని..అయితే..పాక్ కొన్ని పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. 
Read More : HIKKA Cyclone : IMD హెచ్చరికలు..17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!