Viral Video: రైలులో అందరూ చూస్తుండగా.. యువకుడిని ఘోరంగా కొట్టిన టీటీఈ
తన తప్పు ఏంటని ఆ యువకుడు అడుగుతున్నప్పటికీ ఆ టీటీఈ వినలేదు. ఆ యువకుడి...

Viral Video
ఓ యువకుడిని రైల్వే టీటీఈ ఘోరంగా కొట్టారు. ఆ ప్రయాణికుడిపై దుర్భాషలాడారు. బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీటీఈని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు పలువురు ఈ వీడియో జోడిస్తూ ట్వీట్లు చేశారు. ఆ యువకుడిని టీటీఈ ఎందుకు కొట్టాడన్న విషయంపై స్పష్టత లేదు. ఆ యువకుడిని అధికారి కొడుతున్న సమయంలో మరో ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో ఈ వీడియోను తీశాడు. దీంతో వీడియో తీసిన వ్యక్తిపై కూడా టీటీఈ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
వీడియోని పరిశీలిస్తే… ప్రయాణికుడిని టీటీఈ లేచి నిలబడమని అడుగుతూ పదే పదే చెంపదెబ్బలు కొట్టాడు. ఆ యువకుడినిపైకి లేపుతూ అతడి దుస్తులు పట్టుకుని బలవంతంగా లాగాడు. తన తప్పు ఏంటని ఆ యువకుడు అడుగుతున్నప్పటికీ ఆ టీటీఈ వినలేదు. ఆ యువకుడి టికెట్ విషయంలోనే టీటీఈ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకు కొడుతున్నారంటూ తోటి ప్రయాణికులు కూడా అడిగారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ టీటీఈని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.
TT के भेष में भारतीय रेलवे में गुंडे घूम रहे हैं ट्रेन नंबर 15203 में S6 में नीरज कुमार के पास टिकट भी है फिर भी उससे बदतमीजी करने लगे और देखते ही देखते तमतमा कर लात घुसे चलाने लगे। नीरज को इंसाफ मिलेगा ?@IndianRailMedia @RailMinIndia @NWRailways @AshwiniVaishnaw pic.twitter.com/5API7Fdxih
— Adarsh Mohan (@khabar_navis) January 18, 2024
Virat Kohli : విరాట్ కోహ్లీ అద్భుత బౌండరీ సేవ్‌పై ఆనంద్ మహీంద్రా.. ‘హలో, ఐజాక్ న్యూటన్?’