Assam Boat Accident : బ్రహ్మపుత్ర నదిలో పడవల ప్రమాదంపై స్పందించిన ప్రధాని

అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదంలో ఒక పడవ మునిగిపోయింది. పలువురు గల్లంతు అయ్యారు.

Assam Boat Accident : బ్రహ్మపుత్ర నదిలో పడవల ప్రమాదంపై స్పందించిన ప్రధాని

Two Boats Accident In Brahmaputra River

Updated On : September 9, 2021 / 10:51 AM IST

Assam Boat Accident In Brahmaputra river : అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదంలో ఒక పడవ మునిగిపోయింది. ఈ క్రమంలో పలువురు గల్లంతు అయ్యారు. రెండు పడవల్లోను దాదాపు 100మందికిపైగా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసోం రాజధాని గువాహటికి 350 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది తీరంలోని జోర్హత్ నిమతి ఘాట్ వద్ద ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. “అసోంలో జరిగిన పడవ ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాననీ..గల్లంతు అయిన ప్రయానీకులంతా ప్రాణాలతో దక్కాలని నేను ప్రార్థిస్తున్నానన తెలిపారు. గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 

కాగా ఈ ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్ కు వస్తుండగా… మరో పడవ ఎదురుగా రావడంతో రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక పడవ మునిగిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణీకులు ప్రాణాలు దక్కించుకోవటానికి పడవలోంచి నదిలోకి దూకేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు బ్రహ్మపుత్రా నది నీటి వరదనీరు భారీగా వచ్చి చేరింది. ఈక్రమంలో నీటి ఉదృతికి పలువురు కొట్టుకుని పోయారు. వీరిలో ఒక మహిళ మరణించగా పలువురు ఆచూకీ గల్లంతు అయ్యింది.

ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ స్పందించారు. పడవ ప్రమాదం ఎంతో బాధించిందని..తక్షణమే ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రి బిమల్ బోరాను ఆదేశించారు. అన్ని సహాయక చర్యలను చేపట్టాలని మజులి, జోర్హత్ జిల్లాల అధికారులను ఆదేశించారు.దీంతో మంత్రి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా..ఈ ప్రమాదంలో మరణించిన మహిళ గౌహతికి చెందిన స్కూల్ టీచర్ గా గుర్తించారు.కాగా రక్షించబడినవారిలో ఏడుగురు చిన్నారులు మూడు నెలల పసివాడు కూడా ఉన్నారు. వీరంతా ప్రాణాలతో బయటపడటం సంతోషించాల్సి విషయం.

మునిగిపోయిన పడవలోంచి మోటార్ బైకులు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికే చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. గల్లంతు అయినవారిలో 40 మందిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన వారికోసం గాలింపు కొనసోగుతోంది.