Two Boys One Girl: ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. చివరకు ఒక్కరే మిగిలారు.

తండ్రి పుట్టినరోజు నాడు కేక్ కోసం బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌లో తన తండ్రి బర్త్‌డే కేక్‌ కొనేందుకు 19 ఏళ్ల కునాల్‌ అనే యువకుడు రోడ్డు మీదకు వెళ్ళాడు.

Two Boys One Girl: ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. చివరకు ఒక్కరే మిగిలారు.

Two Boys One Girl

Updated On : June 3, 2021 / 1:49 PM IST

Two Boys One Girl: తండ్రి పుట్టినరోజు నాడు కేక్ కోసం బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌లో తన తండ్రి బర్త్‌డే కేక్‌ కొనేందుకు 19 ఏళ్ల కునాల్‌ రోడ్డు మీదకు వెళ్ళాడు. ఇంతలోనే నలుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. కత్తిలతో ఛాతీ, వీపు, పొత్తికడులో పొడిచి హతమార్చారు. అనంతరం నలుగురు అక్కడినుంచి పారిపోయారు.

రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న కునాల్ ను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కునాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి చేశారు. విచారణలో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా తేలింది.

ఓ యువతి విషయంలో కునాల్, నిందితుడు గౌరవ్‌ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని పోలీసులు తేల్చారు. ఇద్దరు ఒకరినే ప్రేమించడంతో కునాల్, గౌరవ్ మధ్య గొడవలు జరిగేవని, అది హత్యకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. ఇక నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తులను ఆన్ లైన్ లో కొన్నట్లు తెలిపారు. నలుగురు నిందితులపై హత్యకేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.