Corona Positive : ఇద్దరు డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా

క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్‌తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ

Corona Positive : ఇద్దరు డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా

Corona Positive

Updated On : January 5, 2022 / 2:58 PM IST

Corona Positive : బుధవారం బీహార్ క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్‌తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కరోనా పరీక్ష తప్పనిసరి చేయడంతో మంత్రులందరూ పరీక్షలు చేయించుకున్నారు.

చదవండి : Bihar’s Vaccine Data : మోదీ,షా,సోనియా,ప్రియాంక చోప్రా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది బీహార్ లోనే!

ఈ నేపథ్యంలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంలు, మరో మత్రులకు కరోనా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ కూడా ఉన్నారు. ఈయన మంగళవారం ఔరంగాబాద్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి సంఘ సంస్కరణ ప్రచార యాత్రలో పాల్గొన్నారు. అయితే, సునీల్ కుమార్‌తో భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరిలకు పాజిటివ్ అని తేలింది. సునీల్ కుమార్‌ తోపాటు ఔరంగాబాద్‌లో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి షానవాజ్ హుస్సేన్ కు నెగెటివ్ అని తేలడంతో ఆయన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.

చదవండి : Bihar Assembly : నా కారునే ఆపేస్తారా? పోలీసులపై మంత్రి ఆగ్రహం.. వీడియో