Viral Video: కాలేజ్ క్యాంటీన్‌లో గొడవపడ్డ ఇద్దరు అమ్మాయిలు.. వైరల్‌గా మారిన వీడియో
బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ మొదలైన గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకొనే స్థాయికి వెళ్లింది.

Two girls had a fight
Viral Video: బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. వెయిటింగ్ మిషన్ పై బరువు చూసుకునే విషయంలో వీరి మధ్య వివాదం మొదలై చివరికి కొట్టుకొనే స్థాయికి చేరింది. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Viral pic: ‘పెళ్లి అంటే ఏంటీ?’ అంటూ 10 మార్కుల ప్రశ్న.. దిమ్మతిరిగేలా జవాబు రాసిన విద్యార్థి
బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెయిటింగ్ మిషన్ పై బరువు చూసుకునే విషయంలో మొదలై ఘర్షణ కొట్టుకొనే స్థాయికి వెళ్లింది. వాగ్వివాదం సమయంలో ఓ అమ్మాయి మరో అమ్మాయిని చెంపపై కొట్టడంతో ఆ అమ్మాయి తిరిగి కొట్టడంతో ఇది కొట్లాట వరకు వెళ్లింది. క్యాటిన్ లో తోటి విద్యార్థినిలంతా పక్కనే ఉన్నారు. అయితే, వీరుఎవరూ ఇద్దరు విద్యార్థినీల మధ్య గొడవను ఆపేందుకు జోక్యం చేసుకోకుండా వారిద్దరి మధ్య గొడవను ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022
అంతేకాకుండా.. వెనుక నిలబడి ఉన్న విద్యార్థినులు చప్పట్లు కొడుతూ వారిద్దరి మధ్య గొడవను ప్రోత్సహిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దాదాపు 50 వేల మంది వీక్షించారు.