Tamil Nadu : క్లాస్‌మేట్ చేత మూత్రం కలిపిన జ్యూస్ తాగించిన విద్యార్థులు.. ఏడాది పాటు సస్పెండ్
స్నేహితులే గదా ఇచ్చారు అని ఓ విద్యార్థి జ్యూస్‌ను ఏ మాత్రం సంకోచించకుండా తాగేశాడు.

Two law students suspended for making classmate drink urine mixed juice
Tamil Nadu : స్నేహితులే గదా ఇచ్చారు అని ఓ విద్యార్థి జ్యూస్‌ను ఏ మాత్రం సంకోచించకుండా తాగేశాడు. ఆ మరుసటి రోజు అతడు క్లాస్‌కు వెళ్లినప్పుడు మిగిలిన విద్యార్థులు అతడిని హేళన చేయడం ప్రారంభించారు. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసి అతడికి మూర్ఛ వచ్చినంత పనైంది. అతడు తాగిన జ్యూస్‌లో మూత్రం కలిపారని తెలిసింది. దీని గురించి అతడు అధికారులకు ఫిర్యాదు చేయగా నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
భాదిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ లా యూనివర్శిటీలో భాదిత విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నాడు. జనవరి 6వ తేదీని అతడికి సహవిద్యార్థులు జ్యూస్‌ను ఇచ్చారు. అతడు దానిని తాగాడు. అయితే.. ఆ మరుసటి రోజు అతడు క్లాస్‌కు వెళ్లినప్పుడు అతడిని సహ విద్యార్థులు హేళన చేయడం ప్రారంభించారు. అప్పుడే అతడికి తెలిసింది. అంతకముందు రోజు అతడు తాగిన జ్యూస్‌లో యూరిన్ కలిపారని.
Punjab : ప్రియురాలి కోసం గెటప్ మార్చావు సరే.. అసలు విషయం మరిచిపోయావుగా..!
దీనిపై బాధిత విద్యార్థి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగరాజ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జనవరి 18న తమ నివేదికను సమర్పించిందని ఇండియా టుడే తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా నిందితులైన ఇద్దరు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. 10వ సెమిస్టర్ రాయకుండా నిషేదించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామ్‌జీ నగర్ పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు.