Women Fight In Gym: జిమ్‌లో తన్నుకున్న మహిళలు.. వామ్మో.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. జిమ్‌లో వ్యాయామంకు వచ్చిన ఇద్దరు మహిళలు స్మిత్ మెషిన్ కోసం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ కాస్త తీవ్రరూపం దాల్చడంతో ఒకరి జట్టు మరొకరు పట్టుకొని తన్నుకున్నారు. వీరిని విడిపించేందుకు జిమ్ కోచ్, తోటి మహిళలు నానా తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Women Fight In Gym: జిమ్‌లో తన్నుకున్న మహిళలు.. వామ్మో.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.. వీడియో వైరల్

Women Fight In Gym

Women Fight In Gym: జిమ్‌లో వ్యాయామం చేసే క్రమంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ కాస్త తీవ్రరూపందాల్చడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని తెగ తన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇద్దరు మహిళల ఫైట్ పై సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. జిమ్‌లో మహిళలు వ్యాయామం చేస్తున్నారు. స్మిత్ మెషిన్ వద్ద ఓ మహిళ వ్యాయామం చేస్తుండగా పక్కనే బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని మరో మహిళ వేచి ఉంది. స్మిత్ మెషిన్ వద్ద మహిళ తన వ్యాయామాన్ని పూర్తిచేసుకొని పక్కకు వెళ్లింది. దీంతో బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్మిత్ మిషన్ వద్దకు వెళ్లి దానిని స్వాధీనంచేసుకొనే క్రమంలోనే గ్రీన్ టీషర్ట్ కలిగిన మహిళ వేగంగా వచ్చి దానిని స్వాధీనం చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తి తీవ్రరూపం దాల్చింది.

ఒకరి జుట్టును మరొకరు పట్టుకొని తన్నుకున్నారు. ఇదిగమనించిన కోచ్, ఇతర మహిళలు వారిని విడిపించేందుకు నానా తంటాలు పడ్డారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. స్మిత్ మెషిన్‌తో వ్యాయామం చేయడం కంటే ఇలా తన్నుకుంటేనే ఒంట్లో కొవ్వు తగ్గుతుందని భావించారనుకుంటా.. అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ వీళ్లు ఈ మాత్రందానికే జిమ్‌లోకి వచ్చారా.. బయట తన్నుకుంటే డబ్బులన్నా మిగిలేవి కదా అంటూ కామెంట్ చేశాడు.