మాల్యా పిటిషన్ తిరస్కరించిన లండన్ కోర్టు
భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది.

భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది.
భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. తనను ఇండియాకు అప్పగించాలన్న యూకే హోం సెక్రటరీ సాజిద్ జావిద్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం(ఏప్రిల్-8,2019) కోర్టు కొట్టేసింది. మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై ఏడాది పాటు కోర్టులో వాదనలు జరుగగా…గత ఏడాది డిసెంబర్‌లోనే లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బత్నాట్ మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.
ఇండియా కోర్టులకు మాల్యా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తేల్చి చెప్పింది.భారత్ లోని జైళ్ల పరిస్థితులు అద్వాణంగా ఉంటాయని,తనను అప్పగించకూడదన్న మాల్యా వాదనను కూడా కోర్టు కొట్టిపారేసింది.ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో మాల్యాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న భారత ప్రభుత్వ హామీకి లండన్ కోర్టు ఓకే చెప్పింది.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర