Kerala: వాటే థాట్.. కేరళలో చిక్కుకుపోయిన యూకే యుద్ధ విమానం.. టూరిజం ప్రమోషన్ కోసం వాడేసుకున్నారుగా.. వైరల్ అవుతున్న మీమ్స్

యూకే నుంచి ఇంజినీరింగ్ బృందం వచ్చి దీనికి మరమ్మతులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

Kerala: వాటే థాట్.. కేరళలో చిక్కుకుపోయిన యూకే యుద్ధ విమానం.. టూరిజం ప్రమోషన్ కోసం వాడేసుకున్నారుగా.. వైరల్ అవుతున్న మీమ్స్

Updated On : July 3, 2025 / 9:40 PM IST

Kerala: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్ అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులుగా యూకే యుద్ధ విమానం కేరళలోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళ టూరిజం డిపార్ట్ మెంట్ తో పాటు నెటిజన్లు తమ రాష్ట్ర టూరిజం ప్రమోషన్ కోసం దీన్ని వాడేసుకున్నారు. దీని ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ ఫైటర్ జెట్ కు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

ఓ నెటిజన్ క్రియేటివిటీ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఫైటర్ జెట్ ను ఉద్దేశించి అతడు పెట్టిన పోస్ట్ సరదాగా ఉంది. ”కేరళ అమేజింగ్ ప్లేస్. నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. మీరు కూడా ఓసారి కేరళకు రండి” అని ఫైటర్ జెట్ అంటున్నట్లు ఒక పిక్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టును కేరళ టూరిజం డిపార్ట్ మెంట్ షేర్ చేసింది.

”ఒక్కసారి కేరళలో ల్యాండ్ అయ్యారంటే.. ఇక ఇక్కడి నుంచి వెళ్లరు. కావాలంటే ఈ బ్రిటీష్ యుద్ధ విమానాన్ని అడగండి” అంటూ మరో నెటిజన్ పెట్టిన పోస్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.

ఇక ఫైటర్ జెట్ ఓ టీ స్టాల్ దగ్గర కుర్చీలో కూర్చుని.. బనానా చిప్స్ తింటూ చిల్ అవుతున్నట్లుగా మరో పిక్ చేశారు. దాని పక్కన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు టీ తాగుతున్నారు. ఫైటర్  జెట్ వారితో ముచ్చట్లు పెట్టినట్లుగా అందులో ఉంది. ఈ మీమ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇలా నెటిజన్లు ఫైటర్ జెట్ ను తమ రాష్ట్ర టూరిజం ప్రమోషన్ కు వాడేసుకుంటున్నారు. ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు. కడుపుబ్బా నవ్వించడంతో పాటు తమ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రమోట్ కూడా చేసుకుంటున్నారు.

Also Read: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా దారుణం.. పెళ్లైన 45 రోజులకే.. భర్తను చంపించిన భార్య..

HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి బయలుదేరిన UK యుద్ధ విమానం… సడెన్ గా ఇంధనం అయిపోవడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ సురక్షితంగా జరిగినప్పటికీ, జెట్ ల్యాండ్ అయిన వెంటనే హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తింది. దీంతో అది తిరిగి ఎగరడం సాధ్యం కాలేదు.

యూకే నుంచి ఇంజినీరింగ్ బృందం వచ్చి దీనికి మరమ్మత్తులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రోజులు గడుస్తున్నా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో దాదాపు నెల రోజులుగా ఈ యుద్ధ విమానం కేరళలోనే ఉండిపోయింది. కాగా, ఈ యుద్ధ విమానాన్ని డిస్ మాంటిల్ చేసి మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తమ దేశానికి తరలించే యోచనలో యూకే అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.