కేరళలో విమాన ప్రమాదం..ఈ పాప ఎవరి బిడ్డో ? తల్లిదండ్రులు ఎక్కడున్నారో

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 08:11 AM IST
కేరళలో విమాన ప్రమాదం..ఈ పాప ఎవరి బిడ్డో ? తల్లిదండ్రులు ఎక్కడున్నారో

Updated On : August 8, 2020 / 9:53 AM IST

కేరళలో జరిగిన విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన చిన్నారి..తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా ఓ పోలీసు ఆమెను ఎత్తుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభం..శుభం..తెలియని ఆ చిన్నారికి ఏం జరిగిందో కూడా తెలియదు.



ఆ పోలీస్ చేతుల్లో ఉన్న ఆ చిన్నారి దీనంగా చూస్తుడడం కలిచివేస్తోంది. చిన్నారిని కొండుట్టి ఆసుపత్రిలో జాయిన్ చేశామని, తల్లిదండ్రుల వద్దకు చేరాలంటే..ఈ ఫొటోను షేర్ చేయాలని, తెలిసిన వారు..948769169 ఫోన్ చేయాలని కోరుతున్నారు.

వందేభారత్ మిషన్ లో భాగంగా..దుబాయ్ నుంచి దుబాయ్ – కోళీకోడ్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ప్రయాణీకులతో వస్తోంది. కొద్ది క్షణాల్లో స్వదేశీ గడ్డపై దిగుతామని అనుకున్నలోపే ఘోరం జరిగిపోయింది. కోజకుడ్ విమానాశ్రయంలో 2020, ఆగస్టు 07వ తేదీ శుక్రవారం రాత్రి విమానం ల్యాండ్ అవుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.



భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. దాంతో బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్‌ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 మందికి గాయాలయ్యాయి.

వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది.