బడ్జెట్ 2019 : అంగన్ వాడీల జీతాలు పెంపు

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 06:56 AM IST
బడ్జెట్ 2019 : అంగన్ వాడీల జీతాలు పెంపు

Updated On : February 1, 2019 / 6:56 AM IST

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సైరన్ కొద్ది రోజుల్లో మోగనుంది. దీనిని క్యాష్ చేసుకొనే పనిలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా..ఓటర్లను ఆకర్షించే విధంగా తాత్కాలిక బడ్జెట్ 2019-20ని ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో పీయూష్ గోయల్ 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. అందులో ప్రధానంగా పలు వర్గలపై వరాల జల్లు కురిపించారు. ఎప్పటి నుండో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీలపై వరాలు ప్రకటించారు. వారి వేతనం ఏకంగా 50 శాతం పెంచుతున్నట్లు వెల్లడించారు. గతంలో అంగన్ వాడీ కార్మికుల వేతనాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.

మరికొన్ని ముఖ్యాంశాలు
* 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు.
* లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా అభివృద్ధి.
 
* రైతుల అకౌంట్లలోకి ఏడాదికి రూ. 6వేలు. మూడు విడతలుగా అందవేత. 
* నెలకు రూ. 15వేల జీతం వచ్చే కార్మికులందరికీ పీఎంఎస్‌వైఎం కింద లబ్ది.
* పీఎంఎస్‌వైఎం యోజన కింద రూ. 3వేల పెన్షన్. 60 ఏళ్లు దాటినప్పటి నుండి. 
* రూ. 3 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు.